E-Paper
Advertisement

Dil Raju: ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ షూటింగ్ అప్డేట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

Dil Raju: ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ షూటింగ్ అప్డేట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
Advertisement

Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)తాజాగా తన బ్యానర్లో రాబోతున్న సినిమాల గురించి అభిమానులకు బిగ్ అప్డేట్ విడుదల చేశారు. దిల్ రాజు నిర్మాణంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ గా రౌడీ జనార్ధన్(Rowdy Janardhan) అనే సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించుకున్న ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని దిల్ రాజు ఈ సందర్భంగా వెల్లడించారు.

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్..

Advertisement

ఇకపోతే దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మ(Yellamma) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) బలగం సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు తన బ్యానర్ లో వేణుకి ఎల్లమ్మ సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పట్టాల పైకి వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడితే వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంతోమంది హీరోలను ఎంపిక చేయక వారందరూ కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు హీరో దొరకని నేపథ్యంలో సినిమా కూడా ఆలస్యమైంది. ఇక ఎల్లమ్మ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంపికైన సంగతి తెలిసిందే.

2026 లోనే రాబోతున్న ఎల్లమ్మ..

సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం ఈ వీకెండ్ లేదా పది రోజులలో ఎల్లమ్మ సినిమా షూటింగు గురించి అప్డేట్ కూడా వెల్లడించబోతున్నామని దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఈ పది రోజులలో ఎల్లమ్మ సినిమాని అధికారక ప్రకటన రాబోతోందని, ఇక 2026 నుంచి ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకొని ఈ సినిమా కూడా 2026 లోనే విడుదల కాబోతుందని దిల్ రాజు తెలిపారు.

Advertisement

ఎల్లమ్మ సినిమాలో కీర్తి నటించలేదు..

ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంపిక కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని, కీర్తి సురేష్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. మరి ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీకి జోడిగా ఎవరు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక దిల్ రాజు ప్రస్తుతం ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాలు చేయడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా సినిమాలను కొనుగోలు చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కాలంలో దిల్ రాజు బ్యానర్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.

Also Read: Spirit Movie: భారీ ధరలకు స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్… ఇదెక్కడి క్రేజ్ సామి!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×