E-Paper
Advertisement

Mushroom Coffee Benefits: మష్రూమ్ కాఫీ తాగుతున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు సుమీ!

Mushroom Coffee Benefits: మష్రూమ్ కాఫీ తాగుతున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు సుమీ!
Advertisement

Mushroom Coffee Benefits: సాధారణంగా మష్రూమ్ అంటే వంటల్లో వాడటమే గానీ కాఫీ చేసుకుని తాగడం చాలామందికి తెలియకపోవచ్చు. అవును మీరు విన్నది నిజమే! మష్రూమ్ కాఫీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. ఈ పుట్టగొడుగుల కాఫీ మనలోని ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతుంది. ఇప్పుడీ మష్రూమ్ కాఫీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం..

ఇన్ఫెక్షన్లతో పోరాటం:

ఈ ఔషధ పుట్టగొడుగులు రోగనిరోధక లక్షణాలను కలిగి ఉండటంతో.. మనకొచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉండటంతో మన శరీరానికి కావాల్సిన ఫీచు ద్వారా పొందవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపడడానికి సహాయపడుతుంది. అలాగే చాగా, రీషి వంటి పుట్టగొడుగుల్లో బీటా-గ్లూకాన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్లరక్త కణాలను సక్రియం చేస్తాయి. అంతేకాదు.. మష్రూమ్‌ కాఫీలో విటమిన్‌ బి సమృద్ధిగా ఉంటడంతో.. ఇది శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది.

Advertisement

Read Also: బ్లాక్ టీ vs బ్లాక్ కాఫీ.. ఈ రెండిట్లో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

ఇతర ప్రయోజనాలు:

* హష్రూమ్ కాఫీలో ఉండే కార్డిసెప్స్ మన శరీరంలో ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతుంది.
* పుట్టగొడుగుల కాఫీ అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* పుట్టగొడుగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని నుంచి తయారు చేసిన కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
* మష్రూమ్ కాఫీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచడంలోనూ సహాయపడుతుంది.
* మష్రూమ్ కాఫీలో సాధారణ కాఫీ కంటే తక్కువ కెఫిన్ తక్కువ కాబట్టి.. సాయంత్రం వేళల్లో ఈ కాఫీ తాగడం వల్ల నిద్రకు ఏ విధంగా భంగం కలగదు.

అలాంటి వాళ్లు దూరంగా ఉండాలి:

Advertisement

మష్రూమ్ కాఫీని సాధారణ కాఫీలాగే తయారు చేస్తాయి. కాకపోతే దీనిలో మష్రూమ్‌ పౌడర్‌ కలుపుతారు. మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకిగా దీని గురించి చెబుతున్నటికి.. మష్రూమ్ కాఫీ వల్ల సైడ్‌‌ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. ముఖ్యంగా.. మష్రూమ్స్ అంటే అలెర్జీ ఉన్నవాళ్లు దీనిని తాగకూడదు. చర్మంపై దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో మంట, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే దానిని మష్రూమ్ అలెర్జీగా పేర్కొంటారు. అలాగే మూత్రపిండాల సమస్య ఉన్నవాళ్లు కూడా ఈ కాఫీని అస్సలు తాగకూడదు. జీర్ణ సంబంధిత సమస్యలున్న వాళ్లు మష్రూమ్‌ కాఫీని తీసుకోవాలనుకుంటే.. ముందుగా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Read Also: ఇదేదో బాగుందే.. ఇలా బ్రష్ చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్ నుంచి రక్షణ పొందొచ్చట!

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×