E-Paper
Advertisement

Viral Video: బావలూ బావలూ సయ్యా.. తుపాకీతో మహిళ డాన్స్, బుక్కైన ముగ్గురు పోలీసులు

Viral Video: బావలూ బావలూ సయ్యా.. తుపాకీతో మహిళ డాన్స్,  బుక్కైన ముగ్గురు పోలీసులు
Advertisement

Viral Video: గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాటిని చూసి తమలోని ఉత్సాహాన్ని బయటపెడుతుంటారు కొందరు పోలీసులు. తాము పోలీసులమన్న విషయాన్ని మరిచిపోతున్నారు.. పోయారు కూడా. తాజాగా అలాంటి ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. అడ్డంగా ముగ్గురు పోలీసులు బుక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

బావలూ బావలూ సయ్యా అంటూ 

Advertisement

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని రాంపూర్-బయరాగీ గ్రామాల మధ్య ఉత్సవం జరుగుతోంది. పల్లెటూరులో ఉత్సావాలు అంటే చెప్పనక్కర్లేదు. కచ్చితంగా రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది. ఆ షో ని చూసేందుకు చాలామంది ఎగబడుతుంటారు. సరిగ్గా అలాంటి వ్యవహారం ఒకటి జరిగింది. స్టేజీపై ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా పిస్టల్ ఊపుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

అన్నట్లు ఆమెతో డ్యాన్స్ చేస్తున్నారు మరో ముగ్గురు పోలీసులు. ఈ వ్యవహారాన్ని చూసి ఒక్కసారి అక్కడి ప్రజలు షాకయ్యారు. దీనికి సంబంధించి కొందరు తమ సెల్ ఫోన్లలో ఆయా దృశ్యాలను రికార్డు చేశారు. సోషల్ మీడియోలో వాటిని అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

పోలీసుల తుపాకీతో ఓ మహిళా డ్యాన్స్ 

చివరకు ఈ వ్యవహారం ఆ జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై అధికారులు ఫోకస్ చేశారు. నార్మల్‌గా డ్యాన్స్ చేయడం ఒకెత్తయితే, ఏకంగా మహిళ చేతిలో గన్ ఉండడంతో చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో అమిత్ చౌదరి, అన్మోల్ తివారీ, మున్నాచౌదరి ఉన్నారు.

అందులో అమిత్ గోపాల్‌ గంజ్ జిల్లాలోని కుచయ్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అన్మోల్ కూడా అదే పోలీస్ స్టేషన్‌లో అగ్నిమాపక విభాగంలో పని చేస్తున్నాడు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.  నవంబర్ 26న ఛాతిహార్ సందర్భంగా అనేకమంది ప్రదర్శనకారులతో కలిసి నృత్యం చేసినట్టు చెబుతున్నారు.

ALSO READ: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని చివరకు

ఆ మహిళ..  డ్యాన్స్ చేస్తూ తుపాకీని ఊపుతూ కనిపించింది. ముగ్గురు పోలీసులు ఆమె పక్కనే డ్యాన్స్ చేశారు. తుపాకీని ప్రభుత్వ ఆయుధంగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఆయుధాల దుర్వినియోగం, ఆ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్యాన్స్ చేసిన కానిస్టేబుళ్లను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా ప్రభుత్వ తుపాకీ అయితే.. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తప్పదని అంటున్నారు. మొత్తానికి డ్యాన్స్ ఏమోగానీ, చివరకు తమ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు కానిస్టేబుళ్లు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×