E-Paper
Advertisement

కళ్ళుచెదిరే రేంజ్ లో జైలర్ 2 ఓటీటీ డీల్.. తలైవా కెరియర్ లోనే హైయెస్ట్..

కళ్ళుచెదిరే రేంజ్ లో జైలర్ 2 ఓటీటీ డీల్.. తలైవా కెరియర్ లోనే హైయెస్ట్..
Advertisement

Jailer 2 OTT: కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth)ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Deelip Kumar)దర్శకత్వంలో జైలర్ 2 (Jailer 2)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిజినెస్ కూడా పూర్తి చేసుకుంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జైలర్ 2 ఓటీటీ బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) భారీ ధరలకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ చేతికి జైలర్ 2..

అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా 160 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రజనీకాంత్ తన సినీ కెరియర్ లో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో డీల్ కుదరలేదని తన సినీ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ డీల్ అని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సైతం ఇప్పటివరకు తమిళ సినిమాలకు ఈ స్థాయిలో ఏ సినిమాకు ఖర్చు చేయలేదని చెప్పాలి. అమెజాన్ ప్రైమ్ అత్యధికంగా 120 కోట్ల రూపాయల డీల్ తమిళ సినిమాలకు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

తమిళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ డీల్..

Advertisement

ఇక రజనీకాంత్ కెరియర్ లో కూడా ఈ సినిమాకు హైయెస్ట్ డీల్ కుదిరిందని చెప్పాలి. రజినీకాంత్ ఇది వరకు నటించిన కూలీ సినిమాకు 120 కోట్ల రూపాయల డీల్ కుదరగా జైలర్ సినిమాకు కేవలం 75 కోట్ల రూపాయల ఓటీటీ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇక జైలర్ సినిమా తమిళనాడు ఆంధ్రాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .ఈ నేపథ్యంలోనే ఏకంగా 160 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

జూన్ 12న రాబోతున్న జైలర్ 2?

Advertisement

ఇలా జైలర్ 2 సినిమాకు ఈ స్థాయిలో డీల్ క్లోజ్ అవ్వడంతో రజినీకాంత్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుందని చెప్పాలి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అవడంతో చిత్ర బృందం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాని జూన్ 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు జోడిగా రమ్యకృష్ణ నటించగా మిథున్ చక్రవర్తి, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి కీలక నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: నిఖిల్ స్వయంభుకు నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్.. టాలీవుడ్ లోనే సరికొత్త ట్రెండ్..

Related News

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

Big Stories

Advertisement
×