E-Paper
Advertisement

నిఖిల్ స్వయంభుకు నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్.. టాలీవుడ్ లోనే సరికొత్త ట్రెండ్..

నిఖిల్ స్వయంభుకు నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్.. టాలీవుడ్ లోనే సరికొత్త ట్రెండ్..
Advertisement

Swayambhu OTT: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదివరకే నిఖిల్ నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.

విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతున్న స్వయంభు..

నిఖిల్ నటించిన స్వయంభు(Swayambhu) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని వాయిదా వేసామని చిత్ర బృందం తెలియచేశారు.

పర్ఫామెన్స్ బేస్డ్ డీల్ ఒప్పందం..

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా తదుపరి విడుదల తేదీని ప్రకటించకపోయినప్పటికీ సినిమా పట్ల మంచి అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు ఓటీటీ నుంచి అద్భుతమైన డీల్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) దక్కించుకుంది. అయితే ఈ సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే సినిమాకు ఇన్ని కోట్లు అంటూ డీల్ కుదుర్చుకుంటారు. కానీ నెట్ఫ్లిక్స్ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తుంది. పర్ఫామెన్స్ బేస్డ్ డీల్ ద్వారా సినిమాలను కైవసం చేసుకుంటున్నారు.

ఎన్ని కలెక్షన్లు వస్తే అంత లాభం..

Advertisement

ఇదివరకు విడుదలకు ముందు సినిమాకు 50 కోట్లు డీల్ కుదుర్చుకుంటే ఆ సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా ఓటీటీ సమస్త చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ఆ సినిమా ఎంత మొత్తంలో కలెక్షన్లను రాబడుతుందనే విషయంపైనే ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఒక సినిమా 200 కోట్ల నెట్ కలెక్షన్లను రాబడితే అందులో సగం అంటే వంద కోట్ల రూపాయలను డిజిటల్ రైట్స్ కింద చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన థియేటర్లలో స్వయంభు సినిమా ఎంత కలెక్షన్లను రాబడితే ఓటీటీ నుంచి అంత మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పాలి. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి సినిమాలు కొనుగోలు చేసినప్పటికీ డిజిటల్ మీడియాలో అనుకున్న స్థాయిలో వ్యూస్ రాకపోవడంతోనే ఇలా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నారని తెలుస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాలు కూడా ఉండవని చెప్పాలి.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్… సైలెంట్ గానే పెళ్లిపీటలు ఎక్కబోతోందా?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×