BigTV English

OTT Movie : కాటికి కాళ్ళు చాపే వయసులో ప్రేమ, పెళ్లి… ఒంటరి బతుకులకు ఓదార్పు ఈ సినిమా

OTT Movie : కాటికి కాళ్ళు చాపే వయసులో ప్రేమ, పెళ్లి… ఒంటరి బతుకులకు ఓదార్పు ఈ సినిమా

OTT Movie : తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారు. కష్టాలను కడుపులో దాచుకుని పెంచుతారు. అయితే తల్లి దండ్రులకు వృద్ధాప్యం సమీపిస్తున్నప్పుడు తోడుగా ఉండాల్సింది పోయి, అనాధలను చేస్తున్నారు కొంతమంది. అలా వృద్ధులను కొందరు ఆశ్రమాలలో వదిలి పెడుతుంటే, మరికొంత మంది తిండి పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంత మంది చచ్చారా ? బతికారా ? అనేది కూడా చూడరు. ఇలా బాధపడుతూ ఒంటరిగా ఉండే ఒక వృద్ధ జంట చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మనోరమ మాక్స్‌ (Manorama Max)

ఈ మలయాళ ఫీల్ గుడ్ డ్రామా మూవీ పేరు ‘జననం 1947 ప్రణయం తుదారున్ను’ (Jananam 1947 Pranayam Thudarunnu). ఈ మూవీ వృద్ధాప్యంలో ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీకి అబిజిత్ అశోకన్ దర్శకత్వం వహించారు. ఇందులో లీలా సామ్సన్, కోజికోడ్ జయరాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2024 మార్చి 15 న థియేటర్లలో విడుదలైంది. అదే ఏడాది జూన్ 14 నుంచి మనోరమ మాక్స్‌ (Manorama Max), ప్లెక్స్ (plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

గౌరి అనే ఒక వృద్ధ మహిళకు ఒక్కగానొక కొడుకు ఉంటాడు. కొడుకు తనని వృద్ధాశ్రమంలో ఉంచడంతో ఒంటరితనంతో బాధ పడుతుంది. సొంత ఇంట్లో జీవించాలనే ఆమె కోరికను కొడుకు పట్టించుకోడు. ఈ విషయం తలుచుకుని ఎవరికి చెప్పాలో తెలియక ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. జీవితంలో ఆనందం కోల్పోయి, నిరాశతో బతుకుతుంది. మరోవైపు ఒంటరిగా ఉండే శివన్ అదే వృద్ధాశ్రమంలో పని చేస్తాడు. తన భార్యను కోల్పోయిన ఈ రైతు వృద్ధాశ్రమంలో వర్క్ చేస్తూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కొద్దిరోజుల్లోనే అక్కడే ఉండే గౌరితో పరిచయం ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ ఎమోషనల్ గా దగ్గర అవుతారు. వృద్ధాశ్రమంలోని ఒక సన్నిహితుడి సలహా మేరకు, గౌరి, శివన్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా అయితే గౌరికి కూడా సొంత ఇంట్లో జీవించే కల తీరుతుంది. శివన్ కి తోడు లేదనే బాధ కూడా తప్పుతుంది.

వారు వేర్వేరు సామాజిక నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ, ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇక పిల్లలకు ఈ విషయం చెప్పి పెళ్ళి కూడా చేసుకుంటారు. తరువాత వారు సాధారణ జీవితంలో ఆనందంగా ఉంటారు. గౌరి ఇంటి పనులు చేస్తూ ఉండగా, శివన్ తన వ్యవసాయ పనులు చేసుకుంటాడు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. శివన్ కి ఒక కొడుకు ఉంటాడు. అప్పుల కారణంగా ఇంటిని అమ్మాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడే ఆ ముసలి వాళ్ళుకు ఇబ్బంది మొదలవుతుంది. ఆ వయసులో ప్రశాంతంగా ఉండాలనుకుంటే, అది కూడా ఒక కల లాగే మిగిలిపోతుందని అనుకుంటారు. చివరికి ఈ వృద్ధ జంట ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ? వీళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతారా ? పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పెడతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను చూడాల్సిందే

Read Also : పిసినారితనంతో పిచ్చెక్కించే మిడిల్ క్లాస్ మూవీ … ఈ కామెడీకి పొట్ట చెక్కలే

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×