Flipkart SASA LELE: షాపింగ్ ప్రియులకు మంచి హాట్ న్యూస్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తన స్పెషల్ సమ్మర్ షాపింగ్ ఫెస్టివల్ SASA LELE పేరుతో మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మే నెల ఎండల వేడిలో అద్భుతమైన డీల్స్, ఆశ్చర్యకరమైన తగ్గింపులు, ప్రత్యేకమైన ఆఫర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా “బై 1 గెట్ 1” ఆఫర్‌లు, డబుల్ డిస్కౌంట్ డీల్స్‌తో ఈసారి మరింతంగా షాపింగ్ మార్గాన్ని ఈజీగా చేస్తోంది. ఫ్యాషన్ నుంచి గాడ్జెట్లు వరకు, హోమ్ అప్లయెన్సెస్ నుంచి పర్సనల్ కేర్ వరకూ ప్రతి విభాగంలో ప్రత్యేక ఆఫర్‌లు సిద్ధంగా ఉన్నాయి. మంచి ధరలకు మంచి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నవాళ్లకి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.
నిత్యవసర వస్తువులు
మే 2, 2025 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ అయితే, సాధారణ వినియోగదారుల కంటే ఒక రోజు ముందే, అంటే మే 1, 2025 నుంచే SASA LELE సేల్ సూపర్ ఆఫర్లను పొందవచ్చు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మషీన్ వంటి నిత్యవసర వస్తువులు మరింత ఈజీగా మీ ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత స్టాక్ తోనే అందుబాటులో ఉంటుంది. అందుకే, మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన ఉత్పత్తిని చూస్తారో, వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. ఆలస్యం చేస్తే, స్టాక్ అవుట్ అనే మాటను వినాల్సి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అనేక మంది బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
డబుల్ డిస్కౌంట్
ఇక “డబుల్ డిస్కౌంట్” ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఒకే ఉత్పత్తిపై రెండు రకాల తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా, మీ బడ్జెట్‌కి మించిన షాపింగ్ ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ డబుల్ డిస్కౌంట్ ఆఫర్. ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులకు సూపర్ డీల్ అవుతుంది.
రోజువారీ బ్లాక్‌బస్టర్ డీల్స్
సేల్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ ప్రత్యేకమైన బ్లాక్‌బస్టర్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ డీల్స్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉదయం ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు లైవ్ అయ్యే ఈ ప్రత్యేక ఆఫర్‌లు రోజురోజుకు షాపింగ్ చేసే వారికి మంచి అవకాశాలను అందిస్తాయి. ప్రత్యేకించి టెక్నాలజీ గాడ్జెట్‌లు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో ఊహించని తగ్గింపులు లభిస్తాయి.
క్షణాల్లో డిస్కౌంట్లు
ఇంకా ఆసక్తికరమైనది ఏమిటంటే, “టిక్‌టాక్ డీల్స్”! కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై పరిమిత గంటల పాటు అద్భుతమైన తగ్గింపులు అందిస్తారు. అంటే కేవలం కొన్ని గంటల్లోపు ఆ డీల్స్ కోసం ప్రిపేర్ అయిపోవాలి. మీరు ఏమైనా స్పెషల్ ఉత్పత్తి కోసం వేచిచూస్తున్నారా? అయితే ఈ టిక్‌టాక్ డీల్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవడం మంచిది.
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్
ఐఫోన్ కొనాలని చాలా కాలంగా కలలు కంటున్నారా? అయితే ఇది మీ అవకాశం. ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్‌లో ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లపై భారీ తగ్గింపులను అందించబోతుంది. అంతేకాదు, ఇటీవలే విడుదలైన iPhone 16, iPhone 16e మోడళ్లపై కూడా బంపర్ డిస్కౌంట్ లభించనుంది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని ధరలకు ఐఫోన్ అందుబాటులోకి రానుంది.
Read Also: Instagram Editis App: ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్..ఫ్రీగా …
చల్లదనాన్ని తెచ్చుకోండి
ఈ వేసవి ఉష్ణోగ్రతలు రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి కాలంలో AC అవసరం తప్పనిసరి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో LG, Voltas, Blue Star, Samsung, Daikin వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్ప్లిట్ ACలపై 50% వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఇంట్లో కూర్చుని, సురక్షితమైన షాపింగ్‌తో ACను బుక్ చేసుకోవచ్చు. ఇంకా పలు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్చేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఖరీదైన గాడ్జెట్‌లు ఇక మరింత సులభం
ఎప్పుడైనా మీరు ఖరీదైన ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచించారా?అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. SASA LELE సేల్‌లో జాక్‌పాట్ డీల్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. Apple MacBook, Samsung Galaxy S సిరీస్, Dyson V15 వంటి హై-ఎండ్ ప్రాడక్ట్స్‌పై భారీ తగ్గింపులు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరి.
ఫ్లిప్‌కార్ట్ స్ట్రాటజీ
వినియోగదారుల మన్ననలు పొందేందుకు, వారి కొనుగోలు శక్తిని మరింత పెంచేందుకు ఇలాంటి ప్రత్యేక సేల్‌లను నిర్వహించి ఫ్లిప్‌కార్ట్ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటోంది. ఇది కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు, వినియోగదారుడికి విలువైన అనుభవాన్ని అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమం.