OTT Movie : కామెడీ జానర్లో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఇష్టంగా చూస్తుంటారు. ఈ సినిమాలు సరదాగా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీ హిందీ సినిమా. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన పిసినారితనంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు. ఈ సన్నివేశాలకు ప్రేక్షకులందరూ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటారు. ఈ మూవీ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
జీ 5 (ZEE5) లో
ఈ బాలీవుడ్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘కంజూస్ మఖీచూస్’ (Kanjoos Makhichoos). 2023 లో వచ్చిన ఈ మూవీకి విపుల్ మెహతా దర్శకత్వం వహించారు. ఇది ఒక గుజరాతీ నాటకం “సజన్ రే ఝూట్ మత్ బోలో” ఆధారంగా రూపొందింది. పియూష్ మిశ్రా,అల్కా అమీన్, శ్వేతా త్రిపాఠీ, రాజీవ్ గుప్తా, రాజు శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ జమునా ప్రసాద్ పాండే అనే పిసినారి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జమునా ప్రసాద్ పాండే ఒక పరమ పిసినారి. ఇతని పిసినారి తనం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇతను తన తండ్రి గంగా ప్రసాద్, తల్లి సరస్వతి, భార్య మాధురి, కొడుకుతో కలసి ఉంటాడు. వీళ్ళంతా అతని పొదుపు, పిసినారితనానికి విసిగిపోయి ఉంటారు. అయితే జమునా ప్రసాద్ ఈ డబ్బును తన తండ్రి కలను నెరవేర్చడానికి దాచి పెడుతుంటాడు. తన తండ్రిని చార్ ధామ్ యాత్రకు పంపడానికి రహస్యంగా కొంత డబ్బును జమ చేస్తుంటాడు. అనుకున్నట్టుగానే యాత్రకు కూడా పంపిస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. జమునా ప్రసాద్ తన తల్లిదండ్రులను చార్ ధామ్ యాత్రకు పంపినప్పుడు, వారు కేదార్ నాథ్‌లో భారీ వరదలో చిక్కుకుంటారు. ఆ తరువాత కనిపించకుండా పోవడంతో అందరూ వాళ్ళు చనిపోయారని భావిస్తారు.
ప్రభుత్వం ఈ కుటుంబానికి నష్టపరిహారం కూడా ప్రకటిస్తుంది. కానీ మధ్యవర్తుల అవినీతి కారణంగా జమునా ప్రసాద్‌కు ప్రకటించిన మొత్తం అందదు. అందుకు గానూ అతను న్యాయం కోసం పోరాడుతూ, అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడతాడు. ఈ క్రమంలో జమునా ప్రసాద్ కు తన తల్లిదండ్రులు బతికే ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చివరికి జమునా ప్రసాద్ కు నష్ట పరిహారం వస్తుందా ? అతని తల్లిదండ్రులు బతికే ఉంటారా ? అతనికి పిసినారితనం పోతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలతో బాత్రూమ్ లో దారుణంగా ఆ పని చేసే సైకో … ట్విస్ట్ లతో పిచ్చెక్కించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్