Upcoming Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు మధ్య సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో సినిమాలు చాలా వరకు యావరేజ్ టాక్ ను అందుకొనేవి. కానీ ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఓటీటీలో ఒకవైపు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా థియేటర్లలో సినిమాలు చూసేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు.. అందుకే ప్రతినెల బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ నెలలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..
హిట్ 3..
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న మూవీ హిట్ 3.. హిట్ సిరీస్ సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందులోనూ నాని చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..
రెట్రో..
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.. ఇది కూడా మే 1 న రిలీజ్ కాబోతుంది.
రైడ్ 2..
2018లో విడుదలైన సూపర్ హిట్ ‘రైడ్’కి సీక్వెల్.. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రైడ్ 2 కూడా మే 1 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
చ సింగిల్..
గీతా ఆర్ట్స్ బ్యానర్లో హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘చ సింగిల్’. కార్తీక్ రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.. మే 9 న రిలీజ్ కాబోతుంది.
హరిహర వీరమల్లు..
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అయ్యాక థియేటర్లలోకి రాబోతున్న మొదటి మూవీ హరి హర వీరమల్లు..మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తమ్ముడు..
నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `రాబిన్ హుడ్` తో కలిపి ప్లాప్ సినిమాల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసాడు. ప్రస్తుతం తమ్ముడు మూవీతో రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. మే 9 న రిలీజ్ కాబోతుంది.
శుభం..
టాలీవుడ్ హీరోయిన్ సమంత, ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది..
లెవెన్..
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. మే 16న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..
భైరవం..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాబోయే చిత్రం ‘భైరవం’ లో కనిపించనున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించగా, పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పిస్తున్నారు. మే 16 న రిలీజ్ కాబోతుంది.
త్రికాల..
త్రికాల మూవీలో శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఈ మూవీలోమాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు మణి తెల్లగూటి దర్శకత్వం వహించాడు. మే 23 న రిలీజ్ అవుతుంది.
Also Read : చిరంజీవికి, ఆమనికి మధ్య గొడవలా..? ఆ మూవీలో అందుకే చెయ్యలేదా..?
ఘాటి..
అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.. మే 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
కింగ్ డం..
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా కింగ్‌డమ్ అని ఫిక్స్ చేశారు. ఈ మూవీ మే 30న థియేటర్లలోకి రాబోతుంది.
ఈ సినిమాలన్నీ మే నెలలో రిలీజ్ అయినందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..