E-Paper
Advertisement

100 కోట్లకు పైగా వ్యూస్ తో దుమ్మురేపుతున్న తెలుగు డిజాస్టర్ మూవీ

100 కోట్లకు పైగా వ్యూస్ తో దుమ్మురేపుతున్న తెలుగు డిజాస్టర్ మూవీ
Advertisement

Jaya Janaki Nayaka YouTube Record: కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్నంతగా ఆడవు. రీజన్స్ ఏవైనా అలాంటి పరిస్థితులలో నిర్మాతలకు మాత్రం భారీ నష్టం తప్పదు. అయితే కొన్ని సినిమాలకు మాత్రం బిగ్ స్క్రీన్ పై ఆదరణ దక్కకపోయినా, ఓటీటీ వంటి స్మాల్ స్క్రీన్లలో మాత్రం మంచి వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఇంకేముంది దర్శకనిర్మాతలు తమ సినిమాకు వచ్చిన ఆ ఊహించని రిజల్ట్ చూసి ఉబ్బితబ్బిబ్బు అవుతుంటారు. తాజాగా ఓ తెలుగు డిజాస్టర్ మూవీ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆ మూవీ పేరే ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka). మరి ఇన్నేళ్ల తరువాత ఈ మూవీ సాధించిన అరుదైన ఫీట్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అసలు విషయం ఏంటంటే ?

2017లో థియేటర్లలో విడుదలై ఫ్లాప్ అయినప్పటికీ, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది తెలుగు రొమాంటిక్-యాక్షన్ డ్రామా ‘జయ జానకి నాయక. రకుల్ ప్రీత్ సింగ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ ను అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ చిత్రం గగన్ – స్వీటీల చుట్టూ తిరిగే ఒక రొమాంటిక్-యాక్షన్ డ్రామా. గగన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) తన క్లాస్‌మేట్ స్వీటీ (రకుల్ ప్రీత్ సింగ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ స్వీటీ తండ్రి వారి సంబంధాన్ని అంగీకరించడు. గగన్ స్వీటీ కుటుంబాన్ని కొంతమంది గూండాల నుండి కాపాడి, వారిని రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. ఈ సంఘటన తర్వాత గగన్ జీవితం పూర్తిగా మారిపోతుంది. అతను ఒక సాధారణ యువకుడి నుంచి ఒక ధైర్యవంతుడైన యోధుడిగా మారి, స్వీటీ కుటుంబాన్ని రక్షించడానికి డేంజరస్ ప్రమాదాలను ఎదుర్కొంటాడు.

స్వీటీ తండ్రి గగన్‌ను మొదట అంగీకరించకపోయినా, గగన్ చూపించిన ధైర్యం, ప్రేమను చూసి క్రమంగా మారుతాడు. కథలో యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్నీ ఉంటాయి. ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, 2019 ఫిబ్రవరిలో యూట్యూబ్‌ లో అప్‌లోడ్ చేశారు. గడిచిన ఏడేళ్లలో ఇది చెప్పుకోదగ్గ వ్యూస్ సాధించి, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లతో పాటు జగపతి బాబు, ప్రజ్ఞా జైస్వాల్, శరత్ కుమార్, తరుణ్ అరోరా, జయప్రకాష్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.

డైరెక్టర్ రియాక్షన్

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ప్రపంచంలోనే యూట్యూబ్‌లో 1000 మిలియన్ల వ్యూస్ ను దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. దర్శకుడు బోయపాటి శ్రీను సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో బోయపాటి శ్రీను “100 కోట్ల వీక్షణలు, 100 కోట్ల హృదయాలు, 100 కోట్ల భావోద్వేగాలు, ఒకే ఒక చిత్రం. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి చిత్రం ‘జయ జానకి నాయక్’. చిత్రాన్ని ఒక చిరస్మరణీయ చిత్రంగా మలిచిన మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

Read Also : సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×