E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Advertisement

Ravi Shastri on Vaibhav Sooryavanshi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 tournament) సెంచరీలు, అర్థ సెంచరీలు నమోదు చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకున్నాడు. అయితే అతనికి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రావడం లేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ కోసం వైభవ్ సూర్యవంశీని తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు గంభీర్. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఎలాగైనా ఇంగ్లాండ్ పైన ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలని… ఈ దెబ్బ‌కు ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం అంటూ ర‌విశాస్త్రి (Ravi Shastri) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రవి శాస్త్రి కీలక సూచనలు చేశారు. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తే బాగుండని… కానీ గంభీర్ అనవసరంగా మిస్ చేసాడని మండిపడ్డారు. ఐర్లాండ్ గడ్డపై వైభవ్ సూర్యవంశీ ఆడి ఉంటే.. వాళ్లకు చుక్కలు చూపించేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌలర్ల ప్యాంట్లు కూడా తడిసిపోయేవి అంటూ వెల్లడించారు. ఐర్లాండ్ లో మైదానాలన్నీ చిన్నగా ఉంటాయని… వైభవ్ ఆడి ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడన్నారు.

అయితే అక్కడ ఛాన్స్ మిస్ చేసిన టీమిండియా యాజమాన్యం… ఐర్లాండ్ సిరీస్ లో అయిన వైభవ్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎవరో ఒకరి పైన వేటు వేసి.. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి అవకాశం ఇస్తే బాగుండన్నారు. ఇంగ్లాండ్ పైన కేవలం రెండు నుంచి మూడు ఓవర్లు వైభవ్ ఆడితే చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ లోపే ఇంగ్లాండును మడత పెట్టేస్తాడని వార్నింగ్ ఇచ్చారు రవి శాస్త్రి. వైభవ్ దెబ్బకు ఇంగ్లాండ్ బౌలర్ల అడ్రస్ కూడా గల్లంతు కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. దీంతో వైభవ్ పై రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీని తీసుకోక‌పోవ‌డం వెన‌క సీక్రెట్ ఇదే?

Advertisement

వైభవ్ సూర్య వంశీ అరంగేట్రం చేస్తాడని క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ గంభీర్ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీని వెనుక పెద్ద రహస్యం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియాలో ఉన్న పాత పద్ధతులను… సీనియారిటీని గౌరవించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. సీనియర్లను తప్పించి నేరుగా 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇస్తే డొమెస్టిక్ ప్లేయర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకుంటుందట యాజమాన్యం. అందుకే టి20 వరల్డ్ కప్ విజేతలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోందట.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

 

Related News

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Nida Dar: నన్ను చూస్తేనే టీమిండియా భ‌య‌ప‌డిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిప‌డేవారు

టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !

Tanveer Ahmed: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

Big Stories

×