E-Paper
Advertisement

జెట్ స్పీడ్‌లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జెట్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జెట్ స్పీడ్‌లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జెట్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Jetlee OTT: టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో, వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు రితేశ్ రానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘జెట్లీ’ (Jetlee). థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ క్రేజీ మూవీ, ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) సొంతం చేసుకుంది. మే 25 నుంచి ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

Read also-‘కరుప్పు’ డబ్బింగ్ నాకు ‘లియో’ వివాదాన్ని గుర్తుచేసింది.. గాయని చిన్మయి ఎమోషనల్..

కథా నేపథ్యం ఇదే..

Advertisement

ప్రజాపతి (అజయ్) అనే ఒక బిజినెస్ మ్యాన్ తన బ్యాంక్‌లోని దాదాపు 15 వేల కోట్ల రూపాయలను వేరే చోట ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. దీంతో ప్రజలంతా డబ్బుల కోసం ధర్నాలు మొదలుపెట్టడంతో, అతను దుబాయ్ పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. అయితే, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మిగతా వారు ప్రజాపతిని చంపాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇండియన్ ఏజెంట్స్ అతన్ని పట్టుకుని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, విమానంలో ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు ప్రజాపతి. అసలు విమానంలో ఏం జరిగింది? అందులోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ వేదవ్యాస్ (సత్య) పాత్ర ఏంటి? మరోపక్క సినీ సుడోకు ఆడే వెన్నెల కిశోర్ కథ ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దాదాపు కథంతా ఒక విమానంలోనే నడుస్తుంది.

Read also-ట్రైలర్ ముగిసింది.. అసలు సినిమా ముందుంది.. మోడీ ‘పొదుపు’ హెచ్చరిక వెనుక అసలు కథ ఇదేనా?

Advertisement

మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది. థియేటర్లలో మిస్ అయిన కామెడీ లవర్స్, ఓటీటీ ప్రియులు మే 25 నుండి జియో హాట్‌స్టార్‌లో ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్‌లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×