E-Paper
Advertisement

హర్యానాలో ఘోరం.. 10 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. యువకుడి దారుణ హత్య!

హర్యానాలో ఘోరం.. 10 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. యువకుడి దారుణ హత్య!
Advertisement

Haryana Crime: హర్యానాలోని ఝజ్జర్ జిల్లా సుబానా గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. గ్రామానికి చెందిన హితేశ్ అనే యువకుడిని టార్గెట్ చేసిన దుండగులు, సినిమా ఫక్కీలో వచ్చి క్షణాల వ్యవధిలో ప్రాణాలు తీశారు. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదర ముఠాకు చెందిన నలుగురు షూటర్లు ఒక కారులో వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. హితేశ్ కనిపించడమే ఆలస్యం.. ఏమాత్రం కనికరం లేకుండా అతనిపై తుపాకులతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.

ఈ దాడి ఎంత వేగంగా, దారుణంగా జరిగిందంటే.. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే దుండగులు ఏకంగా 30 రౌండ్ల బుల్లెట్లు కురిపించారు. శరీరంలోకి అన్ని బుల్లెట్లు దూసుకెళ్లడంతో హితేశ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచాడు. నిందితులు కాల్పులు జరిపి అంతా అయిపోయిందనుకున్నాక ఏమీ తెలియనట్టు కారులో అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement

ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ట్రైలర్ ముగిసింది.. అసలు సినిమా ముందుంది.. మోడీ ‘పొదుపు’ హెచ్చరిక వెనుక అసలు కథ ఇదేనా?

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×