E-Paper
Advertisement

Tyson Naidu OTT: ప్రముఖ ఓటీటీ సంస్థకు టైసన్ నాయుడు స్ట్రీమింగ్ రైట్స్.. భారీ డీల్ కుదిరిందిగా!

Tyson Naidu OTT: ప్రముఖ ఓటీటీ సంస్థకు టైసన్ నాయుడు స్ట్రీమింగ్ రైట్స్.. భారీ డీల్ కుదిరిందిగా!
Advertisement

Tyson Naidu OTT: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ప్రస్తుతం టైసన్ నాయుడు(Tyson Naidu) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రగ్యా జైస్వాల్, నబా నటేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి కాబోతున్న ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీడీల్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

హాట్ స్టార్ చేతికి టైసన్ నాయుడు స్ట్రీమింగ్ రైట్స్..

ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్(Jio Hotstar) సుమారు 20 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారని తెలుస్తుంది. ఇలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు 20 కోట్లు డీల్ కుదరడం అంటే మంచి డీల్ అనే చెప్పాలి ఇటీవల ఎన్నో సినిమాలు ఓటీటీ డీల్ కుదరకపోవడంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు మంచి డీల్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా, ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందించారు.

సినిమాలకు బెల్లంకొండ బ్రేక్

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన ఎంతో విభిన్నమైన కథా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భైరవం కిష్కిందపురి వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు పనులలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం కావడంతో ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కాస్త పక్కన పెట్టారు.

కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..

Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏప్రిల్ 5వ తేదీ కావ్య రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే . ఏప్రిల్ 5వ తేదీ వీరి నిశ్చితార్థం హైదరాబాద్లోని వారి ఫామ్ హౌస్ లో జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 29వ తేదీ వీరి వివాహం తిరుపతిలో చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరగగా, మే ఒకటవ తేదీ సినీ సెలబ్రిటీలకు చాలా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు.

Also Read: నన్ను రెచ్చగొట్టద్దు… సైలెంట్ గా వారికి వార్నింగ్ ఇచ్చిన డెమోన్ పవన్… ఆపేస్తే బెటర్ అంటూ!

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×