E-Paper
Advertisement

Xiaomi 17 vs Samsung S26: కొత్త ఫోన్ కొనేముందు ఇవి చూడకపోతే పప్పులో కాలేసినట్టే!

Xiaomi 17 vs Samsung S26: కొత్త ఫోన్ కొనేముందు ఇవి చూడకపోతే పప్పులో కాలేసినట్టే!
Advertisement

Xiaomi 17 vs Samsung S26: ప్రస్తుతం ఏఐ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలాంటి వారిని ఒకటే ప్రశ్న తెగ వేధిస్తోంది. అదేంటంటే.. లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘షియోమీ 17’ బాగుంటుందా? లేక ఎప్పటిలాగే నమ్మకమైన ‘శాంసంగ్ గెలాక్సీ S26’ తీసుకోవాలా? అని. ఈ రెండు కంపెనీలు కూడా ఈ ఏడాది ఆరంభంలోనే తమ టాప్ క్లాస్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ ఫోన్ కొంటే ఎక్కువ రోజులు మన్నిక వస్తుందో కాస్త వివరంగా తెలుసుకుందామా..

ఆకట్టుకునే క్లాసీ లుక్..

సాధారణంగా ఏదైనా ఫోన్‌ను చేతిలోకి తీసుకోగానే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చేది దాని లుక్. శాంసంగ్ ఈసారి కూడా తమ పాత స్టైల్‌ను వదలకుండానే, చేతిలో పట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉండేలా డిజైన్ చేసింది. దాని స్క్రీన్ క్వాలిటీ గురించి ఇక చెప్పక్కర్లేదు. ఆ స్క్రీన్ మీద వీడియోలు చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం. ఇక షియోమీ విషయానికి వస్తే.. వాళ్లు ఈసారి కొత్త రకం మెటీరియల్ వాడి ఫోన్‌కు ఒక ప్రీమియం లుక్ ఇచ్చారు. ముఖ్యంగా కలర్స్, స్క్రీన్ అంచులు చూస్తే చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.

ఫోన్ అస్సలు హీటెక్కదు..

Advertisement

రోజూవారీ పనులకే కాకుండా.. గంటల తరబడి ఆడే గేమ్స్ వరకు ఈ రెండు ఫోన్లు మెరుగైన పనితీరును అందిస్తాయి. శాంసంగ్ వాడే సాఫ్ట్‌వేర్ మనకు చాలా సింపుల్‌గా, స్మూత్‌గా అనిపిస్తుంది. అదే షియోమీ అయితే స్పీడ్‌లో ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. యాప్స్ ఓపెన్ చేయడం కానీ, ఇంటర్నెట్ వాడటం కానీ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇక ఎక్కువ సేపు వాడినా ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఈ రెండు కంపెనీలు మంచి టెక్నాలజీనే వాడాయి.

Also Read: ఏఐ రేసులో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. గూగుల్, ఓపెన్ ఏఐలకు చెక్ పెట్టేలా MAI మోడల్స్ లాంచ్!

సినిమా లెవెల్ పిక్చర్ క్వాలిటీ..

Advertisement

ఇప్పుడు ఫోన్ అంటేనే కెమెరా. ఎక్కువగా ఫొటోలు తీసే వారినైతే ఈ రెండు ఫోన్లు అస్సలు నిరాశ పరచవు. శాంసంగ్, కెమెరాతో తీసిన ఫోటోలు చాలా నేచురల్‌గా, అచ్చం కళ్లతో చూసినట్టే ఉంటాయి. ముఖ్యంగా చీకట్లో కూడా క్లారిటీ అదిరిపోతుంది. షియోమీ మాత్రం ఈసారి కెమెరా లెన్స్‌ల మీద బాగా ఫోకస్ పెట్టింది. ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్లుగా ఫొటోలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు..

ఏదైనా పనిమీద బయటికి వెళ్లినప్పుడు సడెన్‌గా ఛార్జింగ్ అయిపోతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. శాంసంగ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ బాగుండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా కంటిన్యూగా వాడొచ్చు. అయితే షియోమీ బ్యాటరీ విషయంలో ఫాస్ట్ ఛార్జింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. మనం స్నానం చేసి వచ్చేలోపే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. త్వరగా బయటికి వెళ్లే వాళ్లకు ఇది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్.

ఇంతకీ ఏ ఫోన్ తీసుకోవాలి?

చివరగా ఏది కొనాలనేది మీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. మంచి బ్రాండ్ ఇమేజ్, సాఫ్ట్‌వేర్ వాడటానికి చాలా ఈజీగా ఉండాలి అనుకుంటే కళ్లు మూసుకుని శాంసంగ్ S26ను కొనుగోలు చేయొచ్చు. లేదంటే లేటెస్ట్ ఫీచర్లు, కెమెరా సూపర్‌గా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఛార్జింగ్ నిమిషాల్లో అయిపోవాలి అనుకుంటే షియోమీ 17 బెస్ట్ ఆప్షన్. మొత్తానికి మీ బడ్జెట్, మీకు ఏయే ఫీచర్ ముఖ్యమో చూసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Also Read: ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×