E-Paper
Advertisement

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి
Advertisement

JioHotstar New Releases This Week : ఓటీటీలో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూసే వారికి ఈ వారం జియో హాట్ స్టార్ మంచి లైనప్‌ తో రెడీ అయింది. ఒకే జానర్‌ కు పరిమితం కాకుండా రియాలిటీ షో, థ్రిల్లర్, కామెడీ, హారర్ కామెడీతో పాటు పిల్లలను అలరించే యానిమేషన్ కంటెంట్ కూడా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వరుసగా ఆరు కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ షురూ అవ్వగా… మరికొన్ని రాబోయే రోజుల్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరి ఈ ఆరు రిలీజ్‌లలో మీ మూడ్‌కు సరిపోయే కంటెంట్ ఏదో చూద్దాం పదండి.

ఏ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు ?

ముందుగా సెప్టెంబర్ 8న The Real Housewives of New York Season 16 హాట్ స్టార్ లోకి వచ్చింది. ఇది పూర్తిగా భిన్నమైన రియాలిటీ షో. న్యూయార్క్‌కు చెందిన మహిళల రొటీన్ లైఫ్, వారి మధ్య ఏర్పడే స్నేహాలు, వ్యక్తిగత సంబంధాలు, విభేదాలు, పార్టీలు, లైఫ్‌స్టైల్ వంటి అంశాల చుట్టూ షో సాగుతుంది. నిజ జీవితంలో జరిగే డ్రామాను చూడటానికి ఇష్టపడేవారికి ఈ సీజన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.

Advertisement

సెప్టెంబర్ 9న The Paper Season 2 స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇది థ్రిల్లర్ నేపథ్యంతో సాగే వెబ్‌సిరీస్. కథలో చోటుచేసుకునే పరిణామాలు, పాత్రల మధ్య పరిస్థితులు, ఊహించని మలుపులు సిరీస్‌పై ఆసక్తిని పెంచే అంశాలు. ముఖ్యంగా మొదటి సీజన్‌ను చూసినవారు రెండో సీజన్‌లో కథ ఎటు వెళ్తుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపవచ్చు.

సెప్టెంబర్ 11న రెండు కొత్త కంటెంట్‌లు ఒకేసారి రానున్నాయి. వాటిలో Prince of Mollywood అనే మలయాళ కామెడీ వెబ్‌సిరీస్. కామెడీ ప్రధానంగా ఉండే కథలను ఇష్టపడేవారికి ఇది రిలాక్స్‌డ్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. అదే తేదీన Ali Baba Aur 40 Booth కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. పేరులోనే ఉన్న ఫాంటసీ టచ్‌ కు తగ్గట్టుగా హారర్, కామెడీ అంశాలను కలిపిన ఈ సిరీస్ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు నవ్వించేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

ఇక సెప్టెంబర్ 12న పిల్లల కోసం Jungle Tales with Mowgli అందుబాటులోకి వస్తోంది. మోగ్లీ చుట్టూ సాగే అడవి సాహసాలు, జంతువులతో అతని అనుబంధం, అడవిలో ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులతో ఈ యానిమేటెడ్ సిరీస్ చిన్నారులను ఆకట్టుకోనుంది. కుటుంబంతో కలిసి చూడటానికి సరిపోయే కంటెంట్‌ ఇది.

వీకెండ్ కి అంటే సెప్టెంబర్ 13న Cheekoo Aur Bunty Kusthi Ki Jung రాబోతోంది. రెజ్లింగ్ నేపథ్యాన్ని యానిమేషన్, సరదా అంశాలతో కలిపి రూపొందించిన ఈ మూవీ ముఖ్యంగా పిల్లలకు బెస్ట్ ఆప్షన్. యానిమేటెడ్ క్యారెక్టర్లు, పోటీ, ఫన్ ఎలిమెంట్స్‌ తో చిన్నారులకు మంచి టైమ్‌పాస్ అందించే అవకాశం ఉంది.

Also Read : అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

ఈ వారం స్పెషల్ ఏంటి ?

మొత్తంగా చూస్తే హాట్ స్టార్ ఈ వారం అన్ని వయసుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కంటెంట్‌ ను తీసుకొస్తోంది. రియాలిటీ షోస్ ఇష్టపడేవారికి ‘ది రియల్ హౌజ్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సీజన్ 16’, థ్రిల్లర్ ప్రియులకు ‘ది పేపర్ సీజన్ 2’, కామెడీ కోసం ‘ ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’, హారర్‌తో నవ్వులు కావాలంటే ‘అలీ బాబా ఔర్ 40 బూత్’ ఉన్నాయి. పిల్లల కోసం ‘జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ’, ‘చీకూ ఔర్ బంటి: కుస్తీ కీ జంగ్’ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఓటీటీలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే హాట్ స్టార్ లైనప్‌పై ఒక లుక్కేయండి.

Tags

Related News

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×