Psychological Thriller OTT : ఒక భర్త నిజంగా తన భార్యకు నమ్మకంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఓ మహిళల టీమ్ ను రంగంలోకి దింపితే ? అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి అతని అసలు స్వరూపాన్ని బయటపెట్టే ఈ ‘లాయల్టీ టెస్ట్’లో ఊహించని ట్విస్ట్ ఎదురైతే ? చివరికి భర్తనే కాదు… భార్య జీవితం కూడా ప్రమాదంలో పడితే ? ఇలాంటి మైండ్ గేమ్స్‌తో సాగే ఫిలిప్పీన్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ The Loyalty Game (2026). సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘లాయల్టీ టెస్ట్’ ట్రెండ్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సిరీస్… రిలేషన్‌షిప్ లో అనుమానం ఎలా మొదలవుతుంది ? ఆ అనుమానం ఎంత దూరం తీసుకెళ్తుంది ? అనే అంశాలను థ్రిల్లింగ్ గా చూపిస్తుంది అనేది తెలియాలంటే కథలోకి వెళ్దాం.
ఆనా ఓ వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్. తన భర్త బెన్ తో ఆమె జీవితం బయటకు చూస్తే ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. బెన్ ఓ షుగర్ ప్లాంటేషన్ లో లాయర్ గా పని చేస్తుంటాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉన్నప్పటికీ… కొంతకాలానికి భర్త ప్రవర్తనలో ఆనా కొన్ని మార్పులను గమనిస్తుంది. దీంతో ఆమె మనసులో అనుమానం మొదలవుతుంది. అదే సమయంలో.. భర్త నిజంగా తనకు నమ్మకంగా ఉన్నాడా ? లేక తనకు తెలియకుండా ఏదైనా రహస్య జీవితం కొనసాగిస్తున్నాడా ? అనే విషయం తెలుసుకోవాలని ఆనా నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ‘లాయల్టీ టెస్టింగ్’ చేసే ఓ విచిత్రమైన ఏజెన్సీని సంప్రదిస్తుంది.
ఈ ఏజెన్సీ పని చాలా సింపుల్ గా కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ లో ఉన్న పురుషులను అందమైన మహిళలతో ప్రలోభపెట్టి… వారు తమ భాగస్వాములకు ఎంతవరకు నమ్మకంగా ఉంటారో పరీక్షిస్తారు. మొదట్లో ఇది కేవలం భర్తను పరీక్షించే చిన్న ప్లాన్ లానే కనిపిస్తుంది. కానీ బెన్ విషయంలో పరిస్థితులు ఊహించని మలుపు తిరుగుతాయి. బెన్ కేవలం తన భార్యకు నిజాలు దాచడం మాత్రమే కాదు.. ఆమె ఆలోచనలు, జ్ఞాపకాలు, వాస్తవాన్ని అర్థం చేసుకునే విధానాన్నే ప్రశ్నించేలా మానిప్యులేట్ చేయడం మొదలుపెడతాడు. ఆనా ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్థం చేసుకోలేని స్థితికి చేరుతుంది.
ఇక్కడి నుంచే అసలు మైండ్ గేమ్ మొదలవుతుంది. భర్తను పట్టుకోవడానికి వేసిన లాయల్టీ టెస్ట్… చివరికి ఆనా జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. బెన్ వెనుక దాగి ఉన్న చీకటి రహస్యం ఒక్కొక్కటిగా బయట పడుతుండగా… ఇది సాధారణ భార్యాభర్తల గొడవ కాదని ఆమెకు అర్థమవుతుంది. ఇద్దరు మహిళలు ఒకే పురుషుడి చుట్టూ చిక్కుకోవడంతో… అనుమానం, మోసం, మానిప్యులేషన్, అధికారం కోసం పోరాటం అన్నీ కలిసి ఒక ప్రమాదకరమైన ఆటగా మారతాయి. చివరికి ఆనా తన భర్త అసలు స్వరూపాన్ని తెలుసుకుంటుందా ? లేక బెన్ ఆడే మైండ్ గేమ్ లోనే చిక్కుకుపోతుందా ? అనేదే సిరీస్ లో చూడాల్సిన కథ.
Also Read : పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో
‘ది లాయల్టీ గేమ్’ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫిలిప్పీన్స్ కు చెందిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. జానైన్ గుటిరెజ్, జెరిఖో రోసేల్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే క్రుజ్-అల్వియర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ కు ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఒరిజినల్ ఫిలిపినో ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది. రిలేషన్‌షిప్ మిస్టరీలు, గ్యాస్‌లైటింగ్, మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్స్ నచ్చేవారికి ఈ సిరీస్ మంచి వీకెండ్ ఛాయిస్.