E-Paper
Advertisement

OTT Movie : తండ్రి దుర్మార్గం అన్న అరాచకం… అందమైన అమ్మాయికి నరకం… మస్త్ షేడ్స్ ఉన్న స్టోరీ

OTT Movie : తండ్రి దుర్మార్గం అన్న అరాచకం… అందమైన అమ్మాయికి నరకం… మస్త్ షేడ్స్ ఉన్న స్టోరీ
Advertisement

OTT Movie : ఈ మధ్య థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. నచ్చిన సినిమాని దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఎమోషన్స్ కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఇది అన్న,చెల్లెళ్ల మధ్య ఉండే బంధం ఎంత గాఢంగా ఉంటుందో, అది విషపూరితంగా మారితే ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది ? దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2019లో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘జోసీ & జాక్’ Josie & Jack. సారా లాంకాస్టర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. కెల్లీ బ్రాఫెట్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడిన ఈ డార్క్ థ్రిల్లర్ లో ఒలివియా డిజాంగ్ (జోసీ), అలెక్స్ న్యూస్టాడ్టర్ (జాక్) లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Tubiలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : హాంటెడ్ హౌస్ లో వణికించే దెయ్యాలు… రాత్రైతే రక్తపాతమే… ఒంటరిగా చూడకూడని సిరీస్

కథలోకి వెళ్తే

జోసీ, జాక్ అనే అన్నచెల్లెళ్లు పెన్సిల్వేనియాలోని ఒక పాత ఇంట్లో నివసిస్తుంటారు. వాళ్ళ తండ్రి జోసెఫ్ ఒక తాగుబోతు, కఠినమైన ఫిజిక్స్ ప్రొఫెసర్. తల్లి చనిపోవడంతో అతను తన పిల్లలను బయటి ప్రపంచానికి దూరంగా, ఇంట్లోనే చదువు చెప్పిస్తూ క్రూరంగా పెంచుతాడు. ఈ క్రమంలో జోసీ, జాక్ ఒకరికొకరు తోడుగా ఉంటూ, చాలా సన్నిహితంగా పెరుగుతారు. వాళ్ళ తండ్రి పెట్టే హింస భరించలేక సిటీకి పారిపోతారు. బయటి ప్రపంచం గురించి ఎటువంటి అవగాహన లేని వీళ్ళు అక్కడ బ్రతకడానికి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా జోసీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటుంది.

Advertisement

కథలో అసలు మలుపు జాక్ ప్రవర్తనతో మొదలవుతుంది. బయటి ప్రపంచంలోకి వచ్చాక, జాక్ తన తండ్రి లాగే హింసాత్మకంగా, నియంతలా మారడం మొదలుపెడతాడు. జోసీ ఎవరితోనైనా స్నేహం చేసినా, తిరిగినా సహించలేకపోతాడు. జాక్ తన చెల్లెలిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తాడు. తన తండ్రి నుండి తప్పించుకున్నానని సంబరపడే లోపే, తన అన్నయ్య కూడా అదే మార్గంలో వెళ్తున్నాడని జోసీ గ్రహిస్తుంది. తనను తాను రక్షించుకోవడానికి, తన లైఫ్ కోసం ఆమె ఏం చేసిందనేదే మిగతా కథ.

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×