E-Paper
Advertisement

Bigg Boos 9 Telugu : ఈ పర్సన్ ఫ్రెండ్ కంటే ఎక్కువ… డెమోన్ చేస్తే తప్పు కళ్యాణ్ చేస్తే ఒప్పా తనూజా?

Bigg Boos 9 Telugu : ఈ పర్సన్ ఫ్రెండ్ కంటే ఎక్కువ… డెమోన్ చేస్తే తప్పు కళ్యాణ్ చేస్తే ఒప్పా తనూజా?
Advertisement

Bigg Boos 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 లో గొడవలతో పాటు బాండింగ్ కు సంబంధించిన వివాదం కూడా బాగానే రీసౌండ్ వచ్చింది. ఒకానొకప్పుడు కళ్యాణ్ ను చీదరించుకున్న తనూజ ఇప్పుడు అతనితోనే క్లోజ్ గా ఉంటోంది. ఇక డెమోన్ ను మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉంచుతోంది. తాజా ఎపిసోడ్ లో కళ్యాణ్ తనూజ గురించి ఓపెన్ అయ్యాడు. మరోవైపు డెమోన్ చేసిన కామెడీపై తనూజ సీరియస్ అయ్యింది. ఇంతకీ డెమోన్ ఏమన్నాడు? కళ్యాణ్ ఏం చేశాడు? తనూజ రియాక్షన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కంటెంట్ కోసం కథలు 

డే 99 ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే డెమోన్ – తనూజ చేసుకున్న కామెడీ సీరియస్ టర్న్ తీసుకుంది. మొదట్లో ఈ గొడవ తిండి కోసం జరిగింది. “నీ నోరు అంత పెద్దగా నాది లేదు” అని తనూజ స్టార్ట్ చేసింది. “అది నువ్వే చెప్పాలి” అని డెమోన్ అన్నాడు. “కంటెంటెంట్ ఏదో ఇద్దాం అని ట్రై చేస్తున్నాడు. కానీ కుదరట్లేదు” అని తనూజా మాట వదిలేసింది. “కంటెంట్ గురించి అంటే రీతూని వదిలేసి నీ వెనకాలే తిరిగే వాడిని. ఇవి హార్ట్ ఫీలింగ్స్ అంతే” అని డెమోన్ సమాధానం చెప్పాడు. “నేను చాలా సీరియస్ గా చెబుతున్నా డెమోన్. ప్రతిసారీ ఏదో పోట్రే చేయాలని  ట్రై చేస్తున్నావ్. ఏంటిది ?” అంటూ ఎమోషనల్ అయ్యింది తనూజా. కానీ డెమోన్ ఏదో కామెడీ చేశాడని ఇమ్మూ సర్దిచెప్పాడు. చివరకు తనూజానే వచ్చి సారీ చెప్పడంతో ముగిసింది ఈ గొడవ. అప్పటికి కూడా డెమోన్ ‘నేనేదో కామెడీకి చేసేవి అన్నీ ఎందుకు హార్ట్ కు తీసుకుంటావ్” అని కూల్ గా తీసుకున్నాడు. డెమోన్ చిన్న మాట అంటేనే ఇంత సీన్ చేసిన తనూజ కళ్యాణ్ తో మాత్రం వేరేలా ఉంటుంది.

తనూజతో బాండ్ గురించి కళ్యాణ్ ఓపెన్ 

Advertisement

‘మీ దృష్టిలో బిగ్ బాస్ అంటే ఏంటి?’ అని బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెప్పారు. అందులో కళ్యాణ్ మాత్రం అన్నీ చెప్పి చివరకు తనూజ గురించి ఓపెన్ అయ్యాడు. “ఈ పర్సన్ తో బాండ్ బయటకు వెళ్ళాక కూడా ఇలాగే ఉంటది. అది ఫ్రెండ్షిప్ కాదు అంతకంటే ఎక్కువ” అంటూ ఓపెన్ అయ్యాడు. అతను అంతమాట అన్నా కూడా తనూజ రియాక్ట్ కాలేదు. డెమోన్ కామెడీకి ఏదన్నా అన్నా కూడా తేడాగా పోట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చీదరించుకుంటుంది తనూజ.  అందుకే కళ్యాణ్ ఏం చేసినా పర్లేదా ? డెమోన్ తో ఏంటి ప్రాబ్లమ్ తనూజా ? అని ప్రశ్నిస్తున్నారు డెమోన్ ఫ్యాన్స్.

Read also :  ది ఫైవ్ ఫైటర్స్ కు సీజన్ 9 ఐకానిక్ టాస్కులు… విన్నర్స్ కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×