E-Paper
Advertisement

కొద్ది గంటల్లోనే సముద్రంలో మునిగిపోయే ద్వీపం… సస్పెన్స్ తో మెంటలెక్కించే సై-ఫై అడ్వెంచర్ మిస్టరీ

కొద్ది గంటల్లోనే సముద్రంలో మునిగిపోయే ద్వీపం… సస్పెన్స్ తో మెంటలెక్కించే సై-ఫై అడ్వెంచర్ మిస్టరీ
Advertisement

Adventure movie on OTT: అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడేవారికి ‘జర్నీ 2 ది మిస్టీరియస్ ఐలాండ్’ (Journey 2: The Mysterious Island) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 14 ఏళ్ల క్రితం విడుదలైన ఈ హాలీవుడ్ చిత్రం ఇప్పటికీ అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబంతో కలిసి చూసే సినిమాల జాబితాలో ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. ఒక సీక్రెట్ సిగ్నల్… ఎవరికీ తెలియని ద్వీపం… గంటల వ్యవధిలోనే సముద్రంలో మునిగిపోబోతున్న ప్రదేశం… ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే కథ చివరి వరకు ఆసక్తిని తగ్గనివ్వదు. మరి ఆ ద్వీపంలో అసలు ఏం జరిగింది ? అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు ? 14 ఏళ్ల తరువాత ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సీన్ అనే యువకుడికి తన తాత నుంచి వచ్చిన ఒక సీక్రెట్ సిగ్నల్ అందుతుంది. పాత రేడియో సిగ్నల్‌ను పరిశీలించిన తర్వాత అది పసిఫిక్ మహాసముద్రంలోని ఎవరికీ తెలియని ఓ ద్వీపం వైపు దారి తీస్తుందని అతను గుర్తిస్తాడు. దీంతో తన సవతి తండ్రి హాంక్‌తో కలిసి ఆ ద్వీపాన్ని వెతికేందుకు బయలుదేరుతాడు. ఎన్నో ప్రమాదాలు దాటుకుని చివరికి వాళ్ళు ఆ ద్వీపానికి చేరుకుంటారు. అయితే అక్కడ కనిపించే ప్రపంచం వాళ్ళని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Advertisement

సాధారణంగా పెద్దగా ఉండే జంతువులు చిన్నవిగా కనిపిస్తే, చిన్న కీటకాలు మాత్రం భయపెట్టేంత భారీ పరిమాణంలో కనిపిస్తాయి. అక్కడి ప్రకృతి, జీవజాలం అన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. అయితే అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది. వారు ఉన్న ద్వీపం కొద్ది గంటల్లోనే సముద్రంలో మునిగిపోనుందని తెలుస్తుంది. అక్కడి నుంచి బయటపడాలంటే సమయంతో పోటీ పడాల్సిందే. ఒకవైపు భారీ జంతువుల నుంచి తప్పించుకోవాలి… మరోవైపు ద్వీపం మొత్తం నీటిలో కలిసిపోకముందే బయటకు వెళ్లే మార్గాన్ని కనుగొనాలి.

ఈ ప్రయాణంలో వారికి ఊహించని ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న అట్లాంటిస్ నగరం, వందల ఏళ్ల నాటి జలాంతర్గామి, ప్రాణాలు తీసే ప్రమాదాలు కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. చివరికి వారు ద్వీపం నుంచి బయటపడగలిగారా ? ఆ రహస్య ద్వీపంలో ఇంకా ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయి ? సీన్ తన తాతను కలుసుకున్నాడా ? ద్వీపం నిజంగానే సముద్రంలో కలిసిపోయిందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Advertisement

ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, సాహస సన్నివేశాలు, ప్రకృతి అందాలను చూపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా భారీ తేనెటీగలపై ప్రయాణించే సన్నివేశాలు, రాక్షస బల్లుల నుంచి తప్పించుకునే క్షణాలు, క్లైమాక్స్‌లో వచ్చే ఉత్కంఠభరితమైన సీన్లు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.

తెలుగులోనే స్ట్రీమింగ్

‘జర్నీ 2 ది మిస్టీరియస్ ఐలాండ్’ సినిమాలో డ్వేన్ జాన్సన్, జోష్ హట్చర్సన్, వెనెస్సా హడ్జెన్స్, మైఖేల్ కైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా Netflix, Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 14 ఏళ్ల తరువాత ఓటీటీలోకి అడుగు పెట్టడం విశేషం.

Read Also: సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

Tags

Related News

కూతురును కిడ్నాప్ చేశాడని సీరియల్ కిల్లర్ ను చితకబాదే మెంటలోడు

చావుబతుకుల్లో భార్య… మంచి ముహూర్తం కోసమే ఎదురు చూసే భర్త

187 రోజుల పెళ్లి డీల్… రివేంజ్ కోసం శత్రువు కూతురుతో ఇదేం అగ్రిమెంట్ మావా ?

ఏం థ్రిల్లర్ రా అయ్యా… ఈ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటే చస్తారు

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న తెలుగమ్మాయి ‘ఇల్లరికం’ కామెడీ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

ఒకే ప్యాటర్న్ లో వరుస హత్యలు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×