Kannada Murder Mystery Thriller: ఓటీటీల్లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా సినిమాల ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్టులు, టర్నులు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. అయితే అందులోనూ రా అండ్ రస్టిక్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఈరోజు మనం అలాంటి సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాము. ఒకే హత్య… కానీ దాని వెనుక దాగి ఉన్న సత్యాలు ఏడు వేర్వేరు కోణాల్లో బయటపడతాయి. ఈ స్టోరీతో రూపొందిన సినిమానే కన్నడ సినిమా పరిశ్రమలో ఇటీవల వచ్చిన మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కమల్ శ్రీదేవి (Kamal Sridevi). మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
కథ బెంగళూరులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ ప్రాంతంలో మొదలవుతుంది. శ్రీదేవి అనే మహిళను అక్కడే అత్యంత దారుణంగా హత్య చేస్తారు. ఈ హత్య అన్నీ మర్డర్స్ లాంటి సాధారణ కేసు కాదు. ఎందుకంటే ఒకే సంఘటనను ఏడు విభిన్న కోణాల్లో చూపించే వినూత్నమైన నెరేటివ్ స్టైల్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. కమల్ అనే వ్యక్తి శ్రీదేవిని ఆ ప్రమాదం నుంచి కాపాడాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ అతను రంగంలోకి దిగి, ఆమెకు హెల్ప్ చేసేసరికి సమయం దాటిపోతుంది.
అంతలోనే శ్రీదేవి జీవితం విషాదాంతం అవుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్ లో హత్య వెనుక ఉన్న కుట్రలు బయటకు వస్తాయి. సినిమా స్పెషాలిటీ ఏంటంటే… ఒక్కొక్కరు ఒక్కో నిజం చెప్తుంటారు. కొందరు ఆమెను కామం కోసం రేప్ చేసి చంపారని, మరికొందరు జీవనోపాధి కోసం డబ్బు ఆశతో చంపేశారని, ఇంకా కొందరు పాత శత్రుత్వాల వల్ల చంపారని చెప్తుంటారు. ఈ ఏడు కోణాలు కలిసి మూవీని ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుస్తాయి. ఇంతకీ ఆ శ్రీదేవి ఎవరు ? ఆమెను చంపింది ఎవరు ? ఆమె మృతి గురించి ఏడు కోణాల్లో చెప్పిన స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూసి తీరాల్సిందే.
ఈ సినిమాకు దర్శకుడు వి. ఎ. సునీల్ కుమార్ దర్శకత్వం వహించారు. సచిన్ చెలువరాయస్వామి, సంగీత భట్, కిషోర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 7.8 రేటింగ్ సాధించిన ఈ మూవీ తాజాగానే ఓటీటీలోకి వచ్చింది. Sun NXTలో కన్నడ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు. ఏడు కోణాల్లో బయట పడే ఆ మైండ్ బ్లోయింగ్ స్టోరీ, ఆడియన్స్ మనసును కలచి వేస్తుంది.
Read Also: చావు అంటే భయపడే ప్రియుడికి విషమిచ్చి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ