iQOO Z11 Lite 5G: బడ్జెట్ ధరలో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఐకూ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సరికొత్త మొబైల్ iQOO Z11 Lite 5Gను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జులై 24న లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపే ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. విడుదలైన వెంటనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఇది అమ్మకానికి రానుంది. తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఐకూ ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 6500mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమ్స్ ఆడేవారి కోసం బైపాస్ ఛార్జింగ్, ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా ఇందులో అందించడం విశేషం.
Also Read: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!
రోజువారీ వాడకంతో పాటు 5G కనెక్టివిటీని సాఫీగా రన్ చేయడం కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌ను వాడారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ iQOO Z11 Lite 5G పనిచేస్తుందని సమాచారం. దీనివల్ల యూజర్లకు సరికొత్త మొబైల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఐకూ ఇందులో క్రేజీ AI ఫీచర్లను జోడించింది. ఆడియో, వీడియోలకు ఆటోమేటిక్‌గా క్యాప్షన్లు జనరేట్ చేసే ‘AI క్యాప్షన్స్’తో పాటు ఫొటో ఎడిటింగ్ కోసం ‘AI క్రియేషన్’ టూల్స్ దీనిలో ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో వచ్చే ‘డైనమిక్ లైట్ నోటిఫికేషన్ రింగ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫోన్ లాక్ తీయకుండానే కాల్స్, అలర్ట్స్ తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచుల HD ప్లస్ LCD డిస్‌ప్లేతో రానుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరా ఉండనున్నాయి. మిడ్‌నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. మిగిలిన పూర్తి వివరాలు జులై 24 లాంచ్ ఈవెంట్‌లో తెలియనున్నాయి.
Also Read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?