E-Paper
Advertisement

డిగ్రీ చదివే కుర్రాడు గ్యాంగ్ లీడర్‌గా… ఓటీటీలోకి వచ్చిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్

డిగ్రీ చదివే కుర్రాడు గ్యాంగ్ లీడర్‌గా… ఓటీటీలోకి వచ్చిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Action Movie on OTT : కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓక యాక్షన్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఒక మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా కూడా. జైలు శిక్ష పడిన యువకులు అక్కడ నేరస్థులతో కలిసి ఎలా మరింత ప్రమాదకరంగా మారుతున్నారో ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక యువకుడు తప్పుడు దారిలోకి వెళ్తే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు. ఇది మాస్ ప్రేక్షకులను, క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారిని బాగా ఆకట్టుకుంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కన్నడ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘జేసీ: ది యూనివర్సిటీ’ (JC: The University). ‘జేసీ’ అంటే జ్యుడీషియల్ కస్టడీ అని అర్థం. ఈ సినిమాలో జైలును ఒక యూనివర్సిటీగా పోల్చారు. ఇందులో సూర్య ప్రఖ్యాత్ (మ్యాడీగా), భావన ఎస్ రెడ్డి (మేఘనగా)గా నటించారు. చేతన్ జయరామ్ దీనికి దర్శకత్వం వచ్చించారు. ఈ సినిమాను ప్రముఖ నటుడు డాలీ ధనంజయ తన సొంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. కేవలం కథపై నమ్మకంతో సూర్య ప్రఖ్యాత్ లాంటి కొత్త నటుడిని హీరోగా పెట్టి ఈ ప్రయోగాత్మక సినిమాను తీశారు. సినిమా కోసం హీరో రెండు రకాల మేకోవర్స్ (కాలేజీ స్టూడెంట్, రౌడీ) కోసం చాలా కష్టపడ్డారు. అలాగే జైలు వాతావరణం సహజంగా ఉండటం కోసం బెంగళూరు పరిసరాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి షూటింగ్ చేశారు. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలయ్యింది. ఆ తర్వాత ఇది ఏప్రిల్ 24 నుండి Sun NXT ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా మ్యాడీ (మధుసూదన్) అనే ఒక మామూలు కాలేజీ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. మ్యాడీ తన స్నేహితులతో కలిసి జాలీగా గడిపే టైప్‌. అయితే అనూహ్యంగా జరిగిన ఒక గొడవ వల్ల అతను లోకల్ రౌడీ షీటర్ రాకాతో వైరం పెంచుకుంటాడు. ఆ గొడవ ముదిరి మ్యాడీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఒక సాదాసీదా కుర్రాడు జైలులో అడుగుపెట్టినప్పుడు అతని జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ సినిమా చూపిస్తుంది. జైలుకు వెళ్లిన మ్యాడీ అక్కడ గ్యాంగ్‌స్టర్ల పరిచయంతో క్రమంగా ఒక కరుడుగట్టిన నేరస్థుడిగా మారుతాడు. జైలు నుండి బయటకు వచ్చాక, సమాజం అతన్ని చూసే విధానం మారిపోతుంది. తన పాత శత్రువైన రాకాపై ప్రతీకారం తీర్చుకోవాలని మ్యాడీ నిర్ణయించుకుంటాడు. అలా ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన పంతం కోసం అండర్‌ వరల్డ్ డాన్‌గా ఎలా ఎదిగాడనేది కథలోని ప్రధానాంశం. చివరికి ఈ నేర సామ్రాజ్యంలోకి వెళ్లడం వల్ల మ్యాడీ తన కుటుంబానికి, ఎంత దూరం అయ్యాడనేది ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : చచ్చినోళ్ళు హత్యలు చేస్తూ డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఓటీటీలో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×