Haris Rauf flying kiss: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ( Pakistan Super League 2026) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 38 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో పది రోజుల్లో టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇలాంటి క్రమంలో లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మీ ( Lahore Qalandars vs Peshawar Zalmi) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. బాబర్ ఆజంకు ( Babar Azam) లాహోర్ ఖలందర్స్ బౌలర్ హారిస్ రవూఫ్ ( Haris Rauf ) ఫ్లయింగ్ కిస్ (A flying kiss) ఇచ్చాడు.
59 పరుగుల వద్ద బాబర్ ఆజం ( Babar Azam ) వికెట్ పడగొట్టిన హారిస్ రవూఫ్, సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ముఖం కిందికి వేసి పెవిలియన్ కు వెళ్లిపోయాడు బాబర్ ఆజం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. మగాళ్లు ఇద్దరూ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకుంటారా ? ఇదెక్కడి మాస్ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఇది సాధ్యమే అంటూ మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మీ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన లాహోర్ ఖలందర్స్ 19.3 ఓవర్లలో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మరో వివాదం రాజుకుంది. అంపైర్లతో బాబర్ ఆజం గొడవకు దిగాడు. బంతులు పదే పదే ఎందుకు మార్చుతున్నారు ? అని అంపైర్లను నిలదీసే ప్రయత్నం చేశాడు బాబర్. బౌలర్లు బంతులను గ్రిప్ లేకుండా చేస్తున్నారని అంపైర్లు సమాధానం ఇవ్వగా… మీ చేతకాని తనం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రివర్స్ అటాక్ చేశాడు బాబర్ ఆజం. దీంతో అంపైర్లు వర్సెస్ బాబర్ ఆజం అన్నట్లుగా వ్యవహారం తయారైంది. అయితే గొడవ పెద్దది అయ్యే క్రమంలో తోటి ప్లేయర్లు బాబర్ ఆజంను శాంతింపజేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబర్ ఆజం మ్యాచ్ ఫీజులో కోత ఉంటుందని అంటున్నారు.
A flying kiss by Haris Rauf to Babar Azam as a send off. pic.twitter.com/aUZYbdJA50
— Sheri. (@CallMeSheri1_) April 25, 2026