E-Paper
Advertisement

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా
Advertisement

Kannada Gangster Crime Thriller:  ఓ గ్యాంగ్‌స్టర్‌ కు అత్యంత నమ్మకమైన అనుచరుడు. అతనికి ఇచ్చిన టార్గెట్ ఓ రాజకీయ నాయకుడి హత్య. పని పూర్తి చేయడానికి వందల కిలోమీటర్లు వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడితే ? తాను చంపడానికి వెళ్లిన వ్యక్తితోనే తన గతానికి సంబంధం ఉందని తెలిస్తే ? అంతేకాదు… నమ్మిన గ్యాంగే తనను వేటాడటం మొదలు పెడితే ? వేటగాడిగా బయలుదేరిన ఓ క్రిమినల్‌… చివరకు తానే వేటగా మారిన కథే ‘రాక్కీ’ (Rakky). మరి ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

బెంగళూరు, కేజీఎఫ్ అండర్‌ వరల్డ్‌లో డానీ అనే గ్యాంగ్‌స్టర్‌ కు మంచి పేరు ఉంటుంది. అతని గ్యాంగ్‌ లో రాక్కీ అత్యంత నమ్మకమైన వ్యక్తి. డానీ ఏ పని అప్పగించినా వెనక్కి తగ్గకుండా పూర్తి చేసే మొండితనం అతని సొంతం. అయితే రాక్కీకి డానీ కూతురు సిరితో ఉన్న ప్రేమ సంబంధం కూడా అతని జీవితంలో కీలకంగా మారుతుంది. రాక్కీని మరింత పెద్ద హిట్‌మ్యాన్‌ గా మార్చాలని భావించిన డానీ… సీనియర్ గ్యాంగ్‌స్టర్ గణేష్‌ తో కలిసి అతనికి ఓ ప్రమాదకరమైన కాంట్రాక్ట్ ఇస్తాడు.

Advertisement

ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకుడు వివేక్‌ తో పాటు అతని భార్య సుమ అలియాస్ చాందినిని హత్య చేయాలి. దీంతో రాక్కీ, గణేష్ తమ టార్గెట్‌ ను వెతుక్కుంటూ బయలు దేరుతారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. వివేక్ దగ్గరకు వెళ్లిన తర్వాత రాక్కీకి ఊహించని విషయాలు తెలుస్తాయి. తనకు అప్పగించిన ఈ హత్య వెనుక సాధారణ రాజకీయ కక్ష లేదని అర్థమవుతుంది. తన గతానికి, ఆ రాజకీయ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఒక్కొక్కటిగా బయట పడుతుంది. దీంతో టార్గెట్‌ ను చంపాలనే నిర్ణయంపై రాక్కీకి సందేహాలు మొదలవుతాయి.

ఇదే సమయంలో పోలీసుల ఎంట్రీ కథను మరో మలుపు తిప్పుతుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు, విడాకులు, భరణం పేరుతో నడుస్తున్న చీకటి వ్యవహారాలు కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది. అసలు ఈ కాంట్రాక్ట్ వెనుక ఎవరు ఉన్నారు ? రాక్కీని ఎందుకు ఉపయోగించుకున్నారు ? అనే ప్రశ్నలు మరింత ఆసక్తిని పెంచుతాయి.

Advertisement

చివరకు రాక్కీ తనను నమ్ముకున్న గ్యాంగ్ నుంచే నమ్మకద్రోహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తాను వేటాడిన వాళ్ల కంటే… తనను వేటాడుతున్న వాళ్లే ప్రమాదకరంగా మారతారు. తన మనుగడ కోసం పోరాడుతూ, తన గతానికి సంబంధించిన నిజాన్ని ఎదుర్కొంటాడు. చివరకు ఈ వేట నుంచి రాక్కీ ఎలా బయటపడ్డాడు ? తన ప్రాణాలను కాపాడుకోగలిగాడా ? అనేదే సినిమాలో చూడాల్సిన కథ.

ఓటీటీలో కన్నడలోనే

‘రాక్కీ’కి వెంకట్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. రాక్కీ సురేష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. బి. సురేష్, పల్లవి మంజునాథ్, సంపత్ మైత్రేయ, ఆషికా సోమశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్, యాక్షన్, పొలిటికల్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ కన్నడలోనే చూడాలి. అండర్‌వరల్డ్, కాంట్రాక్ట్ కిల్లింగ్స్, పొలిటికల్ కుట్రలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ‘రాక్కీ’ని ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also: కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×