AP DSC: ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదివిన నిరుద్యోగులకు డీఎస్సీ ఒక ఆశ. కానీ అదే డీఎస్సీ ఇప్పుడు ఏపీలో వివాదాల కేంద్రంగా మారింది. 16,347 టీచర్ పోస్టుల కోసం మూడున్నర లక్షల మంది పోటీ పడిన ఈ నియామక ప్రక్రియపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా విషయంలో అర్హత నిబంధనల మార్పులు, పరీక్ష లేకుండానే నియామకాలు, టెట్ క్వాలిఫై కాకున్నా జాబ్ లు, హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ ఫిట్టింగ్ లు, కొన్ని సర్టిఫికెట్ల అర్హతపై అనుమానాలు ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయి. బిగ్ టీవీ గ్రీవెన్స్ నెంబర్‌కి వందల కాల్స్ చేస్తున్నారు. ఆధారాలతో సహా టెలికాస్ట్ చేస్తున్న బిగ్‌టీవీ ఇన్ స్టాను బ్లాక్ చేయించారు. నిజాయితీతో కూడిన జర్నలిజాన్ని అడ్డుకోవడం ఏంటి?
ఈ ఎపిసోడ్ పై ప్రతిపక్షం CBI విచారణ కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని చెబుతోంది. అయితే అసలు ప్రశ్న ఆరోపణలు నిజమా కాదా అన్నది తేల్చేందుకు స్వతంత్రంగా, సమగ్రంగా విచారణ జరిపించడంలో ఇబ్బంది ఏంటి? అనుమానాలకు తెరపడకపోతే.. నిరుద్యోగుల ఆగ్రహం మరింత పెరగదా?? అక్రమాలపై ఆధారాలతో సహా ముందుకు తెస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలే. సమాధానాలే లేవు.