E-Paper
Advertisement

క్లీన్ గోదావరి సాధ్యమేనా?

క్లీన్ గోదావరి సాధ్యమేనా?
Advertisement

Godavari Pollution: గోదావరి.. కోట్లాది మంది నమ్మకానికి, జీవనానికి ఆధారం. కానీ ఈ నదిలో పారిశ్రామిక వ్యర్థాలపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయ్. ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌పై వచ్చిన ఫిర్యాదులతో NGTలోనూ కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణపై ప్రశ్నలు వచ్చాయ్. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజమహేంద్రవరం కాలుష్యంలో దాదాపు సగం ఆంధ్రా పేపర్స్‌ నుంచే వస్తున్నా చర్యలు లేవన్న ప్రశ్నల్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. 2016 నుంచి స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదని, 21.34 కోట్ల వరకు బకాయిలున్నాయన్న విషయం తెరపైకి వచ్చింది.

గోదావరి పుష్కరాల నాటికి..

Advertisement

రాజమండ్రి సిటీలో రోజుకు 70 మిలియన్ లీటర్ల ద్రవ్య వ్యర్ధాలు విడుదల అవుతుంటే అందులో సగానికి సగం 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచే వస్తున్నాయని కాలుష్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. వచ్చే ఏడాది 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని పవిత్రంగా కాలుష్య రహితంగా చేస్తామన్న ప్రభుత్వ ఆశయాలకు ఈ సిచ్యువేషన్ నెగెటివ్ గా మారుతుండడంతో పవన్ సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతున్నారంటున్నారు. మరి ఇప్పటికైనా గోదావరి కాలుష్యానికి చెక్ పడుతుందా? పవన్ స్వయంగా హెచ్చరించినా ఈ కంపెనీ ఎందుకు వినడం లేదు? గేమ్ ఎక్కడ నడుస్తోంది?

Tags

Related News

DSC స్కామ్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనం..?

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాలు

డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదా.. అయితే ఇది చూడండి

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

Big Stories

Advertisement
×