E-Paper
Advertisement

Annagaru vostaru OTT: ఇట్స్ అఫీషియల్ .. ఓటీటీలోకి కార్తీ ‘అన్నగారు వొస్తారు’!

Annagaru vostaru OTT: ఇట్స్ అఫీషియల్ .. ఓటీటీలోకి కార్తీ ‘అన్నగారు వొస్తారు’!
Advertisement

Annagaru vostaru OTT: కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)నటించిన తాజా చిత్రం వా వాతియార్ .నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా ఈ సినిమాకు ఎన్నో ఆటంకాలు ఏర్పడటంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 14 సంక్రాంతి సందర్భంగా తమిళంలో మాత్రమే విడుదలైది.

అమెజాన్ ప్రైమ్ లోకి అన్నగారు వస్తారు..

ఈ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తమిళ వెర్షన్ లో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో ప్రసారమవుతుంది .అయితే తాజాగా ప్రైమ్ వీడియో ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించిన అప్డేట్ తెలియజేశారు. తెలుగులో అన్నగారు వస్తారు (Annagaru Vostaru) అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.

అన్నగారి ఆగమనం..

Advertisement

ఈ వీడియోలో భాగంగా హీరో కార్తీక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అన్నగారి ఆగమనం.. అన్నగారు వస్తారు మార్చి 6 నుంచి ప్రైమ్ వీడియోలో అనే క్యాప్షన్ తో ఈ వీడియోని విడుదల చేశారు. ఇలా మార్చి ఆరో తేదీ నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. మరి థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో అయినా ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

తమిళంలోనూ బేబమ్మకు నిరాశే..

Advertisement

ఇక హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)నటించి సందడి చేశారు. తెలుగులో పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అటువైపు అడుగులు వేశారు. మొదటి సినిమానే మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోతో అవకాశం అందుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం సరైన సక్సెస్ అందించలేకపోయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా కూడా బేబమ్మకు కాస్త నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమె ఉన్న పరిస్థితులలో తనకు ఒక మంచి హిట్ పడటం ఎంతో కీలకము. ఇలా హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వరుసగా నిరాశ ఎదురవుతూనే ఉంది.

Also Read: Ayesha Khan: రే** చేస్తామంటూ బెదిరింపులు..  ధురంధర్  బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×