E-Paper
Advertisement

Ayesha Khan: రే** చేస్తామంటూ బెదిరింపులు..  ధురంధర్  బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!

Ayesha Khan: రే** చేస్తామంటూ బెదిరింపులు..  ధురంధర్  బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!
Advertisement

Ayesha Khan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఒకానొక సమయంలో సెలబ్రిటీలతో మాట్లాడాలి అంటే లేదా వారి గురించి తెలుసుకోవాలి అంటే వార్తాపత్రికలలో చదవడం లేదంటే ఏదైనా షూటింగ్ సమయంలో సెలబ్రిటీలను చూడటం జరిగేది కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేరుగా మన అభిమాన నటీనటులతో కూడా మాట్లాడే అవకాశం లభించింది. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు కూడా అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇలా అభిమానులకు దగ్గర అవుతున్నందుకు సెలబ్రిటీలు సంతోషపడాలా లేదంటే బాధపడాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

సోషల్ మీడియా ట్రోల్స్ పై హీరోయిన్లు ఆగ్రహం..

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా సినిమా ఈవెంట్లో హీరోయిన్లను జూమ్ చేస్తూ వారి బాడీ పార్ట్స్ అన్నింటిని చూపిస్తున్నారంటూ హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ గురించి కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన అయేషా ఖాన్ (Ayesha Khan)సైతం తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఎదురుకుంటున్న బెదిరింపుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

చిన్న వయసులోనే బాడీ షేమింగ్ కామెంట్స్..

Advertisement

సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కొనసాగుతున్న నేను ఒక మహిళగా కూడా మానసిక వేదనను అనుభవిస్తున్నానని తెలియజేశారు. తనకు ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఒక పాటలో సెకండ్ లీడ్ చేసే అవకాశం వచ్చింది. రేపు సాంగ్ షూటింగ్ అనగా అధిక శరీర బరువు ఉన్నానంటూ నన్ను ఆ పాట నుంచి తప్పించారు .అంత చిన్న వయసులో ఆ బాడీ షేమింగ్ కామెంట్స్ నుంచి నేను బయటపడటానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా స్పందించారు.

ప్రతిరోజు రే** బెదిరింపులు..

Advertisement

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫోటో షేర్ చేయాలంటే కూడా చాలా భయం వేస్తుందని నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను ఈ పోస్ట్ పెడితే ఎలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించి పోస్ట్ చేయాల్సి వస్తుందని తెలిపారు. నేను ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన చాలా మంది కామెంట్ల రూపంలో నన్ను బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజు నాకు సోషల్ మీడియా వేదికగా రే**బెదిరింపులు వస్తున్నాయని నాతో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో బహిరంగంగా పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చూసి చూడకుండా వదిలేయడానికి ఇవి కేవలం కామెంట్స్ కాదు, నా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి అంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read: KVN Production: అప్పుడు జనననాయగన్ ఇప్పుడు టాక్సిక్.. కష్టకాలంలో కేవీఎన్ ప్రొడక్షన్స్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×