E-Paper
Advertisement

Vaa Vaathiyaar OTT : రిలీజైన 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన ‘వా వాతియార్’… కార్తీ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Vaa Vaathiyaar OTT : రిలీజైన 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన ‘వా వాతియార్’… కార్తీ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

Vaa Vaathiyaar OTT : తమిళ నటుడు కార్తీ, కృతి శెట్టి రీసెంట్ గా నటించిన కొత్త చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar Movie) . ఇది థియేటర్లలో సంక్రాంతి కానుకాగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఒక పెద్ద నటుడి సినిమా, ఇంత తక్కువ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఓటీటీలో ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘వా వాతియార్’ జనవరి 14, 2026న థియేటర్లలోకి వచ్చింది. 2026 జనవరి 28 నుంచి ప్రైమ్ వీడియో Prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఈ చిత్రం OTTplay ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు కూడా టాప్-అప్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులోకార్తీ కథా నాయకుడిగా, కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జిఎం సుందర్, రమేష్ తిలక్ సహాయక పాత్రల్లో నటించారు. ఇది నేటి నుండి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ మలయాళంలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

కథ ఏమిటంటే

Advertisement

రామేశ్వరన్ (కార్తీ) విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడే పోలీస్ ఆఫీసర్. అయితే అతని తాత (రాజ్‌కిరణ్) పురాాతన కాలం నాటి ఎం.జి. రామచంద్రన్ (MGR)కి పరమ భక్తుడు. తన మనవడు సాక్షాత్తు ఆ ఎంజీఆర్ పునర్జన్మ అని, ప్రజల కోసం పోరాడే గొప్ప నాయకుడని ఆ తాత బలంగా నమ్ముతుంటాడు. తాత సెంటిమెంట్ కోసం కార్తీ బయటకి మంచివాడిగా నటిస్తూ, లోపల తన స్వార్థం చూసుకునే రెండు రకాల జీవితాలను గడుపుతుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో తన తాత ఆశయాలు, తన నిజాయితీ లేని ప్రవర్తన మధ్య స్టోరీ మలుపులు తిరుగుతుంది. ఇక తన తాత గౌరవాన్ని కాపాడుకోవడానికి, ఒక సామాన్య పోలీస్ ఆఫీసర్ నుండి ఒక ప్రజా నాయకుడిగా (వాతియార్‌గా) రామేశ్వరన్ ఎలా మారాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×