E-Paper
Advertisement

Hero Glamour X 125 vs Honda SP 125: హీరో గ్లామర్ X 125 vs హోండా SP 125, ఏం మైలేజ్ గురూ!

Hero Glamour X 125 vs Honda SP 125: హీరో గ్లామర్ X 125 vs హోండా SP 125, ఏం మైలేజ్ గురూ!

Hero Glamour X 125 vs Honda SP 125 Comparison: ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న హీరో హోండా కంపెనీ, ఆ తర్వాత రెండు గా విడిపోయింది. ఇప్పుడు రెండు కంపెనీలు అదిరిపోయే స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక ఈ కంపెనీ నుంచి వచ్చిన హీరో గ్లామర్ X 125, హోండా SP 125 మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. రెండూ అద్భుతమైన 125cc కమ్యూటర్ బైక్స్ గా విడుదల అయ్యాయి. గ్లామర్ X 125 డిజిటల్ క్లస్టర్, ఛార్జర్ తో పాటు స్టైలింగ్ తో అందుబాటులోకి రాగా, SP 125  స్మూత్ ఇంజిన్, మంచి మైలేజ్ తో సత్తా చాటుతోంది.

హీరో గ్లామర్ X 125 vs హోండా SP 125 పోలికలు   

⦿ ఇంజిన్, పవర్: హీరో గ్లామర్ X 125 124.7 cc ఇంజిన్‌ తో వస్తుంది. 11.39 bhp పవర్, 10.5 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక హోండా SP 125 123.94 cc ఇంజిన్‌ తో వస్తుంది. 10.72 bhp పవర్  10.9 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

⦿ మైలేజ్: హీరో గ్లామర్ గ్లామర్ X 125 మంచి మైలేజీ అందిస్తుంది. ఒక లీటర్ పెట్రోల్ కు సుమారు 65 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. హోండా SP 125 కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో మైలేజ్ ఇస్తుంది. లీటర్ పెట్రోల్ కు సుమారు 63 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Read Also: హోండా యాక్టివా ఇ vs సుజుకి యాక్సెస్ 125, వీటిలో ఏది బెస్ట్ అంటే?

⦿ ఫీచర్లు: గ్లామర్ X 125లో బ్లూ టూత్, USB ఛార్జర్,  పూర్తి డిజిటల్ స్పీడోమీటర్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. SP 125లో కూడా డిజిటల్ కన్సోల్ ఉంది.  కానీ, డిజైన్ మరింత స్పోర్టీగా ఉంటుంది.

⦿ ధర: ఇక ధర వివరాలు పరిశీలిస్తే హీరో గ్లామర్ X 125 ధర సుమారు రూ. 82,967 నుంచి ప్రారంభం అవుతుంది. హోండా  SP 125 ధర సుమారు రూ. 87,878 నుంచి ప్రారంభమవుతుంది. ఇంచుమించు రెండు బైక్ లు సమాన రేటును కలిగి ఉన్నాయి.

⦿ బరువు,  హ్యాండ్లింగ్: SP 125 తేలికగా ఉంటుంది. జస్ట్ 117 కిలోల బరువు ఉంటుంది. సిటీ ట్రాఫిక్ లో ఈజీగా వెళ్లేలా ఉంటుంది. ఇంచుమించు హోండా SP 125 ధర కూడా అదే స్థాయిలో బరువు ఉంటుంది.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన ఈవీలు, జనవరి 2026లో నెంబర్ వన్ ఈ స్కూటరే!

ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఒకవేళ మీరు కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్, తక్కువ బడ్జెట్, ఎక్కువ మైలేజ్ కోరుకుంటే హీరో గ్లామర్ X 125ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. స్మూత్ ఇంజిన్, రిపేర్లు తక్కువగా ఉండటం, రీసేల్ వాల్యూ కోసం అయితే హోండా SP 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సో, మీకు ఏ బైక్ నచ్చిందో చెప్పేయండి.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×