E-Paper
Advertisement

Temple Shadow: ఇంటిపై గుడి నీడ పడకూడదా..? – పడితే ఏమవుతుందో తెలుసా..?

Temple Shadow: ఇంటిపై గుడి నీడ పడకూడదా..? – పడితే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

Temple Shadow: ఇంటిపై గుడి నీడ పడకూడదా..? పడితే ఏమవుతుంది..? అసలు హిందూ శాస్త్రాలు గుడి నీడ ఇంటి మీద పడితే ఏం జరుగుతుందని చెప్తున్నాయి. అసలు వాస్తు శాస్త్రం ప్రకారం గుడి నీడ పడిన ఇంట్లో జరిగే పరిణామాలేంటి..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయం ప్రకారం గుడికి ఎంతో పవిత్రత ఉంటుంది. దేవాలయాను హిందువులు తన సొంత ఇంటికన్నా ఎక్కువ భక్తి భావంతో చూస్తుంటారు. ప్రతి హిందువు ఆలయాలకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. అయితే గుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినా గుడి నీడకు మాత్రం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. గుడి నీడ ఇంటి మీద పడితే జరిగే పరిణామాల గురించి వాస్తు శాస్త్రం వివరంగా తెలిపినట్టు వాస్తు నిపుణులు చెప్తున్నారు.

Advertisement

ఎక్కడైనా హోమం జరిగే చోట చాలా వేడి ఉంటుంది. మనం ఆ వేడిని తట్టుకోలేము. అలాగే ఆలయం దగ్గరలో ఉండకపోవడం అనేది కూడా అలాంటిదే. దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్ర బద్దంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రం. ఆలయాలలో హోమం, యాగాదులు ఎల్లవేళలా జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట అలాగే గుడినీడ ఇంటిపై పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు.

వాస్తు ప్రకారం:

వాస్తు ప్రకారం గుడికి కొన్ని వైపులు మాత్రం ఉండకూడదట. దేవాలయానికి ఇంటికి ఉండవలసిన దూరం గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి కొలవాలట.

ఎటువైపు ఇల్లు ఉండకూడదు?:

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండవచ్చు, వైష్ణవ ఆలయాలకు ముందు ఉండవచ్చు అని శాస్త్రం చెబుతుంది. గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. అలా కాకుండా రివర్స్ లో ఉంటే కనుక ఆ కుటుంబంలో వివాదాలు, కలహాలు ఎక్కువ కలిగే ప్రమాదం ఉంటుందట.

ఎంత దూరం లో ఉండాలి?:

శివాలయాలకు, వైష్ణవ ఆలయాలకు, అలాగే శక్తి ఆలయాలకు 200 అడుగుల దూరం లోపు ఇండ్లు నిర్మించుకోకూడదు. ముందు చెప్పినట్టుగా ఇంటికి గుడికి దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండే పరిగణలోకి తీసుకోవాలట. అంతేకాదు ఇక్కడ చెప్పబడిన ఆలయాలకు దగ్గరలో నివసించడం వల్ల ఆ ఇంట్లో వారిని దారిద్య్రం వెంటాడుతుందట. డబ్బు నిలవదట.శి వాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే మాత్రం శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందట.

వైష్ణవాలయానికి దగ్గరలో ఉంటే..?:

వైష్ణవాలయానికి దగ్గరలో కనుక ఇల్లు ఉంన్నట్లయితే ఆ ఇంటినుండి అమ్మవారు విడిచి స్వామివారి సన్నిదిలోకి వెళ్ళిపోతారట. ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదట. డబ్బు సమస్య ఎల్లవేళలా పీడిస్తుందట.

శక్తి ఆలయానికి దగ్గరలో:

శక్తి ఆలయానికి ఆనుకుని ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లోని వారు ఎవ్వరూ వృద్ది చెందరు. అంతేకాదు ఏ కార్యక్రమంలో పురోగతి ఉండదట. ఏ కార్యక్రమ్మాన్ని చేపట్టినా ఫలితం శూన్యమేనట.

వినాయకుని ఆలయానికి దగ్గరలో:

ఇంటికి 200 అడుగుల లోపు ఉత్తరాన, వాయువ్యంలో వినాయకుని ఆలయం ఉన్నవారికి ధన నష్టం, అవమానాలు జరుగుతాయట. వృధా ఖర్చులు పెడతారట. మీరు ఒకవేళ ఇప్పటికీ ఆలయాల నీడపడే చోట మీ ఇల్లు ఉంటే కనుక వెంటనే వాస్తు శాస్త్ర నిపుణులను సంప్రదించాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: హిజ్రాల దీవెన ఎందుకు తీసుకుంటారు  – అసలు పురాణాలు ఎం చెప్తున్నాయి

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×