E-Paper
Advertisement

Kennedy OTT release date : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్

Kennedy OTT release date : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్
Advertisement

Kennedy OTT release date : ఓటీటీలోకి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన హిందీ థ్రిల్లర్ ‘కెన్నెడీ’ మూవీ వచ్చేస్తోంది. ఇది అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు వచ్చింది. ఇప్పుడు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. కమర్షియల్ గా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు. అందాల భామ సన్నీ లియోన్ కూడా ఈ సినిమాలో నటించింది. మరి ఈ సినిమాని మాత్రం సన్నీ ఫ్యాన్స్ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘కెన్నెడీ’ (Kennedy) 2023 మే 24లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2023న అక్టోబర్ 29న జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకి వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ థ్రిల్లర్ ఇప్పుడు ZEE5 లో డైరెక్ట్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. 2026 ఫిబ్రవరి 20 నుంచి ఈ సినిమాను ఇంట్లోనే చూడవచ్చు. రాహుల్ భట్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమాలో రాహుల్ భట్ నిద్రలేమితో బాధపడుతున్న ఒక మాజీ పోలీసు అధికారిగా నటించాడు. సన్నీ లియోన్ కూడా చార్లీ అనే మహిళా క్రిమినల్ పాత్రని పోషించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఉదయ్ శెట్టి (రాహుల్ భట్) ఒకప్పుడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కానీ కొన్ని కారణాల వల్ల లోకం దృష్టిలో అతను చనిపోతాడు. అయితే అసలు విషయం ఏంటంటే, అతను చనిపోలేదు. ‘కెన్నెడీ’ అనే పేరుతో అజ్ఞాతంలో ఉంటూ, ముంబైలోని కొందరు అవినీతి పోలీస్ అధికారుల దగ్గర రహస్యంగా కిరాయి హంతకుడిగా పనిచేస్తుంటాడు. అతనికి ఒక వింత సమస్య ఉంటుంది. అతనికి అస్సలు నిద్ర పట్టదు. ఆ నిద్రలేని రాత్రుల్లో అతను చేసే హత్యలు, ఆ క్రమంలో జరిగే క్రైమ్ డ్రామా చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఈ ప్రయాణంలో అతనికి చార్లీ (సన్నీ లియోన్) అనే మహిళ పరిచయం అవుతుంది. ఆమె రాక ఉదయ్ జీకితం మరిన్ని మలువులు తిరుగుతుంది. ఇందులో రక్తపాతం, వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. మొత్తానికి ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి వచ్చి తన శత్రువుల పని ఎలా పట్టాడు ? చివరికి ఏమయ్యాడు అనేదే అసలు కథ.

Advertisement

Read Also : హీరో నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేస్తే… ఏడేళ్ళ క్రితమే ఆగిపోయిన సిరీస్… ఇన్నేళ్ల తరువాత అప్డేట్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×