E-Paper
Advertisement

Telugu film celebrities meeting:విక్టరీ వెంకటేష్ ఇంట్లో.. 70 మంది పైగా నిర్మాతలు, హీరోల సమావేశం, ఏం జరుగుతోంది?

Telugu film celebrities meeting:విక్టరీ వెంకటేష్ ఇంట్లో.. 70 మంది పైగా నిర్మాతలు, హీరోల సమావేశం, ఏం జరుగుతోంది?
Advertisement

Telugu film celebrities meeting: సినీ వర్గాల్లో ఈరోజు జరిగిన ఒక సమావేశం పెద్ద చర్చగా మారింది. అదే ఆర్ఎస్ఎస్ పెద్దల సమావేశం. ఈ సమావేశం హైదరాబాద్‌లోని విక్టరీ వెంకటేష్ ఇంట్లో జరగడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశానికి ప్రముఖ సినీ నిర్మాతలు మైత్రీ రవి, సాహు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఈ సమావేశంలో కనిపించారు. వారిలో నాగార్జున, నాని, వెంకటేష్, తేజు సజ్జా ఉన్నారు. సినీ రంగానికి చెందిన ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ సమావేశానికి 70 మందికి పైగా ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

సమావేశంలో ప్రధానంగా సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ ఆలోచనలను సినీ ప్రముఖులతో పంచుకున్నారని తెలుస్తోంది.

వెంకటేష్ ఇంట్లో ఈ సమావేశం జరగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకటేష్ కుటుంబం అందరితో బాగా కలిసి ఉండే వాళ్ళు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దల సమావేశానికి ఆయన ఇంటిని ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

ఈ సమావేశంపై అధికారికంగా ఎక్కువ వివరాలు బయటకు రాకపోయినా, సినీ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ నేతలు కలిసి ఒకే వేదికపై చర్చించడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ALSO READ: Dhurandhar OTT : థియేటర్లో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో మాత్రం మిశ్రమ స్పందన..!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×