E-Paper
Advertisement

OTT Movie : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : కొరియన్ వెబ్‌కామిక్ హారర్‌ కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఒక సినిమా, సినీ ప్రియులను బాగా అలరించింది. ఇందులో వచ్చే ట్విస్టులు, హారర్ ఎలిమెంట్స్ కు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా ఒక రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. ఆమె పుస్తకంలో రాసిన రచనలు, నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అసలు ఇవి ఎలా జరుగుతున్నాయనేదే ఈ కథ. ఈ సినిమా ట్విస్టులతో మెంటలెక్కిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

ఈ సినిమా కథ కంగ్ జీ-యూన్ అనే ప్రముఖ హారర్ వెబ్‌కామిక్ రచయిత చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కామిక్‌లలో భయంకరమైన, అతీంద్రియ కథలను రాస్తూ బాగా పేరు తెచ్చుకుంది. కథ మొదలవ్వడంతో, జీ-యూన్ తన తాజా వెబ్‌కామిక్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ కామిక్‌లో ఒక దెయ్యం ఒక కంపెనీ ప్రెసిడెంట్‌ను హత్య చేసే కథ ఉంటుంది. ఇది ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు కథలో మొదటి ట్విస్ట్ వస్తుంది. జీ-యూన్ పనిచేసే కామిక్ ప్రచురణ సంస్థ అధ్యక్షుడు యోన్-వూ, ఆమె కామిక్‌లో వర్ణించిన విధంగానే దారుణంగా హత్య చేయబడతాడు. ఈ హత్య జరిగిన సమయంలో జీ-యూన్ సంఘటనా స్థలంలో ఉంటుంది. దీంతో పోలీసులు ఆమెను ప్రధాన అనుమానితగా అరెస్టు చేస్తారు.

Advertisement

జీ-యూన్ తన అమాయకత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తూ, తన కామిక్‌లోని దెయ్యం నిజంగా ఈ హత్యలకు కారణమని చెబుతుంది. అయితే ఆమె వాదనను ఎవరూ నమ్మరు. పోలీసు డిటెక్టివ్ లీ కి-చుల్ ఈ కేసును దర్యాప్తు చేస్తూ, జీ-యూన్ గతం తవ్వడం మొదలుపెడతాడు. ఈ పరిశోధనలో ఆమె గతంలో సో-హ్యూన్ అనే యువతి కథలను దొంగిలించినట్లు తెలుస్తుంది. సో-హ్యూన్ అనే రచయిత, అతీంద్రియ కథలు చెప్పడంలో నైపుణ్యం కలిగి ఉండేది. ఆ కామిక్‌లకు కథలను జీ-యూన్ సొంతం చేసుకోవడానికి, సో-హ్యూన్‌ను హత్య చేసినట్టు బయటపడుతుంది. అయితే సో-హ్యూన్ చనిపోయే ముందు ఒక హెచ్చరిక చేస్తుంది. ఆమె కథల వల్ల ఆత్మలు శక్తి పొందుతాయి. కథలోని సంఘటనలు నిజ జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా హత్యల రూపంలో జరుగుతుంటాయి.

ఇక జీ-యూన్ కామిక్‌లోని సంఘటనలు ఒక్కొక్కటిగా నిజ జీవితంలో జరగడం మొదలవుతాయి. దీంతో ఆమె భయంతో వణికిపోతుంది. ఈ హత్యల వెనుక సో-హ్యూన్ ఆత్మ ఉందని, ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వచ్చిందని జీ-యూన్ అనుమానిస్తుంది. ఈ సమయంలో ఆమె తన గిల్ట్ తో మానసికంగా పోరాడుతుంది. క్లైమాక్స్ లో జీ-యూన్ తన గతంలో చేసిన తప్పులను ఎదుర్కోవలసి వస్తుంది. సో-హ్యూన్ ఆత్మ, జీ-యూన్ రాసిన కామిక్‌ల ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది. జీ-యూన్ తన కామిక్‌లో రాసిన ముగింపును మార్చడం ద్వారా ఈ హత్యలను ఆపడానికి ప్రయత్నిస్తుంది. సినిమా ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? జీ-యూన్ పై సో-హ్యూన్ ప్రతీకారం ఎలా తీర్చుకుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్‌లో

Advertisement

‘కిల్లర్ టూన్’ (Killer toon) అనేది 2013లో విడుదలైన దక్షిణ కొరియా సైకలాజికల్ హారర్ మిస్టరీ చిత్రం. ఇది కిమ్ యోంగ్-గ్యూన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో లీ సి-యౌంగ్ (జీ-యూన్, వెబ్‌కామిక్ ఆర్టిస్ట్), ఉమ్ కీ-జూన్ (కీ-చుల్, డిటెక్టివ్), హ్యూన్‌వూ (జీ-హ్యూన్, పబ్లిషర్), కిమ్ ఎ-జూ (సూన్-హీ, జీ-యూన్ ఏజెంట్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1 గంట 44 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2013 జూన్ 27న విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Read Also : నది ఒడ్డున అమ్మాయి శవం… ఒంటిపై బట్టల్లేకుండా దారుణం… చేసిందెవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×