BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. (16/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. (16/09/2025)

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి:

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.


మిథున రాశి:  

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటక రాశి:

సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

సింహరాశి:

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కన్యారాశి :

దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తులారాశి:

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికరాశి:

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాణాచలనాలు తప్పవు.

ధనస్సు రాశి:

మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరరాశి:

ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కుంభరాశి:

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

మీనరాశి:

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (16/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (15/09/2025)

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 14 – సెప్టెంబర్‌ 20)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (14/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (13/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (12/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (11/09/2025)

Big Stories

×