Korean Spy Action Thriller: దేశాన్ని కాపాడాల్సిన గూఢచారి సంస్థలోనే ఓ వ్యక్తి శత్రు దేశానికి రహస్యాలు చేరవేస్తాడు. అందుకే అతడిని పట్టుకునే బాధ్యత ఇద్దరు కీలక అధికారులకు అప్పగిస్తారు. కానీ ఆ గూఢచారి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్లిద్దరి మధ్యే అనుమానాలు మొదలవుతాయి. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి వస్తుంది. అసలు ద్రోహి ఎవరో తెలుసుకునే క్రమంలో బయటపడే రహస్యాలు, రాజకీయ కుట్రలు, ఉత్కంఠభరితమైన యాక్షన్తో సాగే కొరియన్ స్పై థ్రిల్లర్ ‘హంట్’ (Hunt). స్పై యాక్షన్ ప్రియులకు ఐఫీస్ట్ లాంటి ఈ సినిమాను ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయంలోకి వెళ్తే…
దక్షిణ కొరియా గూఢచారి సంస్థలో పార్క్ ప్యోంగ్-హో, కిమ్ జంగ్-డో కీలక అధికారులుగా పని చేస్తుంటారు. అయితే సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ గూఢచారి ఉత్తర కొరియాకు చేరవేస్తున్నాడని తెలుస్తుంది. తర్వాత అతడిని పట్టుకునే బాధ్యత వీరిద్దరికీ అప్పగిస్తారు. డోంగ్లిమ్ అనే కోడ్ పేరుతో వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి తమ సంస్థలోనే ఉన్నాడనే అనుమానం కలగడంతో దర్యాప్తు మొదలవుతుంది.
ప్యోంగ్-హో, జంగ్-డో తమ తమ విభాగాల్లో విచారణ చేపడతారు. అయితే దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ పరిస్థితులు మరింత గందరగోళంగా మారతాయి. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు సమాచారాన్ని దాచి పెడుతున్నారు అనే విషయం తేల్చడం కష్టమవుతుంది. శత్రువును వెతకాల్సిన అధికారులే ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకోవాల్సి వస్తుంది. తమ పక్కనే పని చేస్తున్న వ్యక్తిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదిలా ఉండగా దేశ భద్రతకు సంబంధించిన మరో కీలక విషయం బయట పడుతుంది. గూఢచారిని పట్టుకోవడమే కాకుండా, అతడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు ? అతడి వెనుక ఎవరున్నారు ? అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ప్రతి సమాచారం కొత్త అనుమానానికి దారి తీస్తుంది. ఒకరు వేసిన అడుగును మరొకరు గమనిస్తుంటారు. ఈ క్రమంలో రాజకీయ కుట్రలు, రహస్య ఆపరేషన్లు, ప్రాణాలకు ముప్పు తెచ్చే సంఘటనలు ఎదురవుతాయి.
తమకు తెలిసిన విషయాలనే మళ్లీ అనుమానించాల్సిన పరిస్థితి ప్యోంగ్-హో, జంగ్-డోలకు ఎదురవుతుంది. అసలు ద్రోహి ఎవరు ? దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర వెనుక ఉన్నది ఎవరు ? చివరికి నిజాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు అధికారులు ఎంత వరకు వెళ్తారు ? అనేదే సినిమాలో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.
‘హంట్’ 2022లో విడుదలైన దక్షిణ కొరియా స్పై యాక్షన్ థ్రిల్లర్. పార్క్ ప్యోంగ్-హో పాత్రలో లీ జంగ్-జే (Lee Jung-jae), కిమ్ జంగ్-డో పాత్రలో జంగ్ వూ-సంగ్ (Jung Woo-sung) నటించారు. జియోన్ హ్యే-జిన్ (Jeon Hye-jin) కూడా కీలక పాత్రలో కనిపించారు. లీ జంగ్-జే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా Jio Hotstarలో అందుబాటులో ఉంది. అనూహ్యమైన మలుపులు తిరిగే యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చవచ్చు.
Read Also: జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్… నాలుగో సీజన్ రచ్చ రచ్చ