E-Paper
Advertisement

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ
Advertisement

Crime Drama Series: 25 ఏళ్లు జైలులో మగ్గి బయటకు వచ్చిన ఓ మాఫియా డాన్‌… పాత గ్యాంగ్‌ తనను పక్కన పెట్టడంతో కొత్త నగరంలోనే మరో సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. డబ్బు, అధికారం, పలుకుబడి అన్నీ సంపాదిస్తాడు. కానీ ఎంత ఎదిగినా శత్రువులు మాత్రం తగ్గరు. ఓవైపు తన సామ్రాజ్యాన్ని కూల్చేయాలని చూసే ప్రత్యర్థులు, మరోవైపు అతడి వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే రాజకీయ నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో తన వాళ్లను కాపాడుకుంటూ శత్రువుల ఆట కట్టించాలంటే ఆ డాన్‌ ఎంతకైనా తెగించాల్సిందే. తనదైన స్టైల్‌, పదునైన వ్యూహాలతో మరోసారి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న డ్వైట్‌ మాన్‌ఫ్రెడి కథే ‘తుల్సా కింగ్‌ సీజన్‌ 4’ (Tulsa King Season 4). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

డ్వైట్‌ ది జనరల్‌ మాన్‌ఫ్రెడి అంటే న్యూయార్క్‌ మాఫియాలో ఒకప్పుడు తిరుగులేని పేరు. కానీ 25 ఏళ్ల జైలు జీవితం అతడి స్థానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తన పాత గ్యాంగ్‌ తనను గౌరవంగా చూసుకుంటుందని ఆశిస్తాడు. కానీ అక్కడ అతడికి ఎదురయ్యేది అవమానం. న్యూయార్క్‌లో ఉండనివ్వకుండా ఓక్లహోమాలోని తుల్సాకు పంపించేస్తారు. తన వాళ్లే తనను పక్కన పెట్టడం డ్వైట్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. అయితే ఓటమిని అంగీకరించడం అతడి నైజం కాదు. తనను వద్దనుకున్న వాళ్లకు తన సత్తా ఏంటో చూపించాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

తుల్సాలో అడుగు పెట్టిన డ్వైట్‌ దగ్గర పెద్దగా పరిచయాలు ఉండవు. అండగా నిలిచే గ్యాంగ్‌ ఉండదు. అయినా తన తెలివితేటలతో స్థానికంగా కొందరిని తనవైపు తిప్పుకుంటాడు. బోధి, టైసన్‌, మిచ్‌ వంటి వ్యక్తులతో కలిసి చిన్నచిన్న వ్యాపారాల నుంచి తన కార్యకలాపాలను విస్తరిస్తాడు. అతడికి డబ్బు సంపాదించడం మాత్రమే లక్ష్యం కాదు. తనను తక్కువ అంచనా వేసిన ప్రపంచానికి తన విలువ ఏంటో నిరూపించుకోవాలి. అలా మొదలైన ప్రయాణం క్రమంగా తుల్సాలో ఓ బలమైన సామ్రాజ్యానికి పునాది వేస్తుంది.

అయితే డ్వైట్‌ ఎదుగుతున్న కొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి. తన వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసే ప్రత్యర్థులు, అతడి బలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతారు. బయటకు నవ్వుతూ పలకరించే వాళ్లలో ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు వెన్నుపోటు పొడిచే శత్రువులో గుర్తించడం కష్టమవుతుంది. ఒక చిన్న పొరపాటు చేసినా ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోయే ప్రమాదం ఎదురవుతుంది.

Advertisement

నాలుగో సీజన్‌లో డ్వైట్‌కు అసలైన పరీక్ష ఎదురవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే నష్టాలు ఒకవైపు, సామ్రాజ్యాన్ని కూల్చేయాలని చూసే శత్రువులు మరోవైపు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇలాంటి సమయంలో ఎవరిని నమ్మాలి ? ఎవరిని వదులుకోవాలి ? తన వాళ్లను రక్షించుకోవడానికి ఎంత దూరం వెళతాడు ? తన అనుభవం, ధైర్యం, క్రూరమైన నిర్ణయాలతో దీని నుంచి హీరో బయటపడతాడా? లేక తానే నిర్మించుకున్న సామ్రాజ్యం అతడి చేతుల్లోంచి జారిపోతుందా? అన్నదే ఈ సీజన్‌లో ఉత్కంఠను పెంచే అంశం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

‘తుల్సా కింగ్‌ సీజన్‌ 4’ (Tulsa King Season 4) JIo Hotstarతో పాటు Amazon Prime videoలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ (Sylvester Stallone) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో మార్టిన్‌ స్టార్‌ (Martin Starr), జే విల్‌ (Jay Will), విన్సెంట్‌ పియాజ్జా (Vincent Piazza), ఫ్రాంక్‌ గ్రిల్లో (Frank Grillo) తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. మాఫియా ప్రపంచంలోని ఎత్తుగడలు, ఊహించని ద్రోహాలు, అధికార పోరాటాలు, డ్వైట్‌ మార్క్‌ కామెడీతో సాగే ఈ క్రైమ్‌ డ్రామాను సిరీస్ అభిమానులు అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Related News

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

Big Stories

Advertisement
×