E-Paper
Advertisement

Laalo on OTT : 100 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన గుజరాతీ సినిమా ఓటీటీలోకి… ఐయండిబిలో 8.6 రేటింగ్

Laalo on OTT : 100 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన గుజరాతీ సినిమా ఓటీటీలోకి… ఐయండిబిలో 8.6 రేటింగ్
Advertisement

Laalo on OTT : బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది Laalo సినిమా. 100 కోట్ల క్లబ్‌ను దాటిన ఏకైక గుజరాతీ సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది ఈ సినిమాను. అయితే ఎనిమిది వారాల్లో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను దాటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లాలా అనే ఒక కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్ కి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా తోడుగా నిలిచాడు ? అతని జీవితం ఎలా మారింది ?అనే అంశాలతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ గుజరాతీ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు కూడా సిద్దమవుతోంది.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే

అంకిత్ సఖియా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ (Laalo – Krishna Sada Sahaayate). ఇది 2025 అక్టోబర్ 10న గుజరాతీలో విడుదలైంది. తరువాత 2026న జనవరి 9న హిందీ-డబ్ వెర్షన్‌లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైనప్పుడు మొదట బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే బలమైన మౌత్ టాక్ ఫలితంగా మూడవ వారం నుండి ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా చూశారు. ఇప్పటి వరకు 120 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది. ఇక దీని స్ట్రీమింగ్ హక్కులను SonyLIV సొంతం చేసుకుంది. ఈ సినిమా 2026 మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది దాని అసలు భాష అయిన గుజరాతీలో విడుదలయ్యే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ కూడా ఉన్నందున, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అదే ప్లాట్‌ఫామ్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో కరణ్ జోషి (లాలా), శ్రుహద్ గోస్వామి (కృష్ణుడు) ప్రధాన పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లాలా ఒక సాదాసీదా ఆటో డ్రైవర్. జీవితంలో అన్నీ కష్టాలే కావడంతో నాకే ఎందుకిలా జరుగుతోంది? అని దేవుడి మీద విరక్తి పెంచుకుంటాడు. ఒకరోజు ఒక పాత ఫామ్‌హౌస్‌లో ఒంటరిగా ఇరుక్కుపోయినప్పుడు, అతని దగ్గరకు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు అంటే ఏదో గాలిలో నుంచి రావడం కాదు, ఒక మామూలు మనిషిలా వచ్చి లాలా పక్కన కూర్చుని కబుర్లు చెబుతాడు. తన మాటలతో లాలాకు జీవితం మీద ఉన్న కోపాన్ని పోగొట్టి, మనం చేసే పనులే మన తలరాతను ఎలా మారుస్తాయో అర్థమయ్యేలా వివరిస్తాడు.

నిజానికి మన కష్టాల్లో దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, కానీ మనం గుర్తుపట్టలేం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. లాలా తన గతాన్ని మర్చిపోయి, తనలో ఉన్న లోపాలను ఎలా సరిదిద్దుకున్నాడు అనేదే మెయిన్ స్టోరీ. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. అందుకే ఇది కేవలం భక్తి సినిమాగానే కాకుండా, ఒక మంచి మోటివేషనల్ స్టోరీలా అందరికీ నచ్చేసింది.

Advertisement

Read Also : కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి… ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×