E-Paper
Advertisement

OTT Movie : మొగుడు ఉండగానే పనోడితో రాసలీలలు… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : మొగుడు ఉండగానే పనోడితో రాసలీలలు… చిన్న పిల్లలు చూడకూడని మూవీ
Advertisement

OTT Movie : రొమాంటిక్ జానర్ లో వచ్చిన ‘లేడీ చాటర్లీస్ లవర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇరవయ్యో శతాబ్ధం ఆరంభంలో మొదలయ్యే ఈ కథ ఒక ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది. ఒక ప్రమాదంలో భర్త మంచానికే పరిమితం అవ్వడంతో భార్య పని వాడితో సంబంధం పెట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాలో హాట్ సీన్స్ కి కొదవ ఉండదు. అలాగే స్టోరీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా రొమాంటిక్ మూవీ లవర్స్ కి మస్త్ మజా ఇస్తుంది. అయితే దీనిని ఒంటరిగా చూడటం మంచిది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘లేడీ చాటర్లీస్ లవర్’ (Lady Chatterley’s Lover ) అనేది 2022లో విడుదలైన ఒక పీరియడ్ రొమాంటిక్ మూవీ. ఇది 1928లో D.H. లారెన్స్ రాసిన ఒక వివాదాస్పద నవల ఆధారంగా రూపొందింది. అయితే లారెన్స్ రాసిన నవల ఆ కాలంలో వివాహేతర సంబంధాలను ధైర్యంగా చర్చించడంతో ప్రచురణ సమయంలో తీవ్ర అభ్యంతరాలకు గురైంది. ఈ సినిమాకి లౌరే డి క్లెర్మోంట్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎమ్మా కోరిన్, జాక్ ఓ’కానెల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 2022 నవంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. 2022 డిసెంబర్ 2నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కాన్నీ రీడ్ అనే యువతి, సర్ క్లిఫోర్డ్ చాటర్లీ అనే ధనవంతుడిని పెళ్లి చేసుకుంటుంది. అతను సైన్యంలో ఒక అధికారిగా ఉంటాడు. వివాహమైన కొద్దికాలానికే మొదటి ప్రపంచ యుద్ధంలో క్లిఫోర్డ్ తీవ్రంగా గాయపడి, నడుము కింది భాగం పక్షవాతానికి గురవుతుంది. ఈ ప్రమాదం వల్ల అతను శారీరకంగా బలహీనుడవుతాడు. దీంతో వీళ్ళ వైవాహిక జీవితం కేవలం మాటలకే పరిమితమవుతుంది. అతనిలో కదలికలు లేకపోవడంతో శారీరకంగా దూరమవుతారు. ఇక ఆ ఎస్టేట్‌లో అన్ని ఉన్నా ఆమె ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. తన జీవితంలో ఏదో కోల్పోయిన భావనతో సతమతమవుతుంది. పైగా వయసులో ఉండటంతో కోరికలు కూడా రగులుతుంటాయి.

Read Also : వరల్డ్ ప్రీమియర్లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ సమయంలో ఎస్టేట్‌ను చూసుకునే ఒలివర్ మెల్లర్స్ అనే పని వాడితో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం క్రమంగా హద్దులు దాటుతుంది. ఇక ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్లు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు ఆమె ఫుల్ జోష్ లో ఉంటుంది. పని వాడితోనే జీవితం గడపాలనుకుంటుంది. ఇంతలో ఆమె ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. భర్తను వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. చివరికి ఆమె ఎవరితో జీవితం పంచుకుంటుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×