E-Paper
Advertisement

OTT Movie : వరల్డ్ ప్రీమియర్లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : వరల్డ్ ప్రీమియర్లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
Advertisement

OTT Movie : జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్‌ బౌండ్’ అవార్డుల దిశగా పయనిస్తోంది. ఈ సినిమాకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగు పెట్టబోతున్న ఈ సినిమా, ఇండియా నుంచి ఆస్కార్స్ కి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇది ఇండియా నుంచి ఎంపికైంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్రలో ఇమిడి పోయింది. ఈ కథ పోలీస్ అధికారులు కావాలని కలలు కనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోతే, ఓటీటీలో ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో అంటే

జాన్వీ కపూర్ నటించిన ఈ ‘హోమ్‌బౌండ్’ (Homebound)సినిమాకి ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కాగా, నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. దీనిని 2020లో బషరత్ పీర్ రాసిన న్యూయార్క్ టైమ్స్ కథనం ఆధారంగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, 2025 మే 21న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక చిన్న గ్రామంలో షోయబ్ (ముస్లిం అబ్బాయి) చందన్ (దలిత్ అబ్బాయి) అనే ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ, ఒకేలా కలలు కంటూ, పోలీస్ జాబ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ కులం, మతం వల్ల సమాజం వీళ్లని వేరు చేస్తుంది. షోయబ్‌కి ముస్లిం అని డిస్క్రిమినేషన్, చందన్‌కి దలిత్ అని గౌరవం లేకపోవడం వంటి సంఘటనలు వీళ్ళని బాధపెడతాయి. అయినా కూడా పట్టణంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ ట్రై చేస్తుంటారు. కానీ కులం, మతం కారణంగా రిజెక్ట్ అవుతారు. దీంతో ఇద్దరూ నిరాశలో పడతారు.

Read Also : సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ డార్క్ కామెడీ చిత్రం… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

ఈ సమయంలో COVID లాక్‌డౌన్ మొదలవుతుంది. షోయబ్ ఇంటికి డబ్బు పంపాలని, చందన్ తన కుటుంబాన్ని చూడాలని గ్రామానికి వెళ్లాలని డిసైడ్ అవుతారు. కానీ బస్సులు లేవు, ట్రైన్స్ ఆగిపోయాయి. ఇక చేసేదేం లేక ఇద్దరూ కలిసి పాదయాత్ర మొదలెడతారు. ఈ ప్రయాణంలో కూడా వాళ్ళు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. యాత్ర మధ్యలో వీళ్లకి చందన్‌కి అనే అమ్మాయి (జాన్వీ కపూర్) పరిచయం అవుతుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏమిటి ? చందన్‌కి వీళ్ళ జీవితాలను మలుపు తిప్పుతుందా ? వీళ్ళు పోలీసులు అవుతారా ? మరేదైనా సమస్యల్లో పడతారా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×