E-Paper
Advertisement

Legal Drama OTT : తెలివితేటలతో హైలెట్ అయ్యే తీర్పులు… రెండేళ్లుగా టాప్ ట్రెండింగ్ లో లీగల్ డ్రామా… ఐయండిబిలో 8 రేటింగ్

Legal Drama OTT : తెలివితేటలతో హైలెట్ అయ్యే తీర్పులు… రెండేళ్లుగా టాప్ ట్రెండింగ్ లో లీగల్ డ్రామా… ఐయండిబిలో 8 రేటింగ్
Advertisement

Legal Drama OTT : కోర్ట్‌రూమ్ డ్రామాల కంటెంట్ సీరియస్ గా సాగుతుంటాయి. బుర్ర తిరగే వాదనలతో ఆడియన్స్ ను టెన్షన్ పెట్టిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హిందీ సిరీస్ కామెడీతో చాలా అద్భుతంగా చూపించారు. అందుకే ఈ సిరీస్ ప్రేక్షకుల మనసులో గట్టిగా నిలిచిపోయింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో టాప్ రేటింగ్ తో నడుస్తోంది. దీనికి ఐయండిబిలో 8/10 రేటింగ్ కూడా ఉంది. ఢిల్లీలోని పట్పర్‌గంజ్ జిల్లా కోర్టు నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతి రోజు విచిత్రమైన, నవ్వులు పుట్టించే కేసులు వస్తుంటాయి కోర్టుకి. ఈ సన్నివేశాలు చూసే కొద్ది చూడాలనిపించేలా ఉంటాయి. అంతేకాదు ఇందులో చూపించే కొన్ని వింత కేసులు, కోర్టుల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ హిందీ కోర్టురూమ్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘మామ్లా లీగల్ హై’ (Maamla Legal Hai). రాహుల్ పాండే ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కోర్టు రూమ్ డ్రామాను సీరియస్‌గా కాకుండా, వ్యంగ్యంగా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇందులో ప్రధాన పాత్రలో రవి కిషన్ (వీడీ త్యాగిగా) నటించగా, నిధి బిష్త్, నైలా గ్రెవాల్, అనంత్ వి జోషి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇది విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 లిస్టులో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇది హిందీలో రూపొందినప్పటికీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో డబ్బింగ్ అందుబాటులో ఉంది. మొదటి సీజన్ 2024 మార్చి 1న విడుదలై భారీ విజయం సాధించడంతో, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే రెండవ సీజన్‌ను ప్రకటించింది. ఇది 2026 ఏప్రిల్ 3న మరింత జోష్ తో రిలీజ్ కాబోతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథ అంతా ఢిల్లీలోని పట్పర్‌గంజ్ జిల్లా కోర్టు చుట్టూ తిరుగుతుంది. అక్కడ వీడీ త్యాగి (రవి కిషన్) అనే ఒక తెలివైన లాయర్ ఉంటాడు. ఆయనకి ఎలాగైనా బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవాలని ఆశ ఉంటుంది. ఆయన కింద పనిచేసే లాయర్లు, కోర్టు సిబ్బంది అందరూ కలిసి అక్కడకి వచ్చే వింత వింత కేసులను ఎలా డీల్ చేస్తారు అనేది చాలా కామెడీగా చూపించారు. ముఖ్యంగా హార్వర్డ్ లో చదువుకుని, ఆదర్శాలు మాట్లాడే ఒక జూనియర్ లాయర్ ఈ కోర్టులోని పద్ధతులకు అలవాటు పడలేక పడే ఇబ్బందులు నవ్వు తెప్పిస్తాయి. ఇందులో కోర్టు కేసులు అంటే ఏదో సీరియస్ గా ఉండవు, చాలా విడ్డూరంగా ఉంటాయి. ఒక కోతి మీద కేసు వేయడం, విడాకుల కోసం వింత కారణాలు చెప్పడం వంటివి భలే సరదాగా ఉంటాయి. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ లాయర్లు చేసే గారడీలు, వాళ్ళ మధ్య ఉండే పోటీని చాలా సహజంగా, మన ఇంటి పక్కన జరిగే గొడవల్లాగే సింపుల్ గా చూపించారు. అందుకే ఈ సిరీస్ అందరికీ బాగా నచ్చింది.

Read Also : రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ లో… ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టనున్న మరాఠీ సిరీస్… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×