E-Paper
Advertisement

కొడుకు కోసం ఓ తల్లి త్యాగం… మనసుని కలిచివేసే కథ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

కొడుకు కోసం ఓ తల్లి త్యాగం… మనసుని కలిచివేసే కథ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్
Advertisement

Musical Drama OTT : తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మాటల్లో చెప్పలేం. అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే కొన్ని సినిమాలను చూస్తే తల్లి ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అని పిస్తుంది. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఎమోషనల్ సినిమాకు, సంగీతం మిక్స్ చేసి తెరమీదకు తీసుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కన్నీళ్లు తెప్పించే ఒక మ్యూజికల్ ట్రాజెడీ సినిమా. మామూలు మ్యూజికల్ సినిమాల్లోలాగా ఇందులో కేవలం సంతోషం ఉండదు. ఒక పేద తల్లి తన కొడుకు చూపు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే బాధ కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా, మన కళ్ల ముందే ఒకరి జీవితం కాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. సినిమా ముగిసేసరికి ప్రతి ప్రేక్షుకుడి మనసు భారంగా మారిపోయేలా చేయడమే ఈ మూవీ ప్రత్యేకత. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ మ్యూజికల్ డ్రామా సినిమా పేరు ‘డ్యాన్సర్ ఇన్ ద డార్క్’ (Dancer in the Dark). 2000లో వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు లార్స్ వాన్ ట్రియర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు అత్యంత వినూత్నమైన టెక్నాలజీ వాడారు. సాధారణంగా సినిమాలను ఒకటి లేదా రెండు కెమెరాలతో తీస్తారు. కానీ ఇందులోని మ్యూజికల్ సీన్స్ కోసం ఏకంగా 100 డిజిటల్ కెమెరాలను ఉపయోగించారు. దీనివల్ల ప్రతి కోణం నుండి నటీనటుల హావభావాలు అద్భుతంగా రికార్డ్ అయ్యాయి. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, ప్రధాన పాత్ర పోషించిన బ్యోర్క్, దర్శకుడి మధ్య జరిగిన గొడవలు. బ్యోర్క్ కేవలం నటి మాత్రమే కాదు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింగర్ కూడా. ఆమె సినిమాలో సెల్మా పాత్రలో ఎంతగా లీనమైపోయిందంటే, ఆ పాత్ర పడే వేదన ఆమెను వ్యక్తిగతంగా కూడా చాలా కుంగదీసింది. షూటింగ్ సమయంలో దర్శకుడి పనితీరు నచ్చక ఆమె సెట్స్ నుండి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె నటనకు గాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు లభించింది. అంతేకాదు ఈ సినిమా 2000లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారమైన పామ్ డి ఓర్ (Palme d’Or) ను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ముబి, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1964లో సెల్మా అనే ఒక పేద మహిళ తన కొడుకుతో కలిసి అమెరికాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక ఫ్యాక్టరీలో చాలా కాలం నుంచి వలస కార్మికురాలిగా చేస్తుంటుంది. అయితే ఆమెకు ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఆమెకు వంశపారంపర్యంగా వచ్చే ఒక జబ్బు వల్ల కంటిచూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. తనలాగే తన కొడుకు కూడా అంధుడు కాకూడదని, వాడికి ఆపరేషన్ చేయించడం కోసం ఆమె తన కష్టార్జితాన్ని రూపాయి రూపాయి పోగేసి దాచుకుంటుంది. ఆమెకు హాలీవుడ్ మ్యూజికల్ సినిమాలు అంటే పిచ్చి, అందుకే తన కష్టాలను మర్చిపోవడానికి తన చుట్టూ జరిగే శబ్దాలను సంగీతంగా ఊహించుకుంటూ తన లోకంలో తాను బతుకుతుంటుంది.

అయితే కథను ఇప్పుడే ఒక మలుపు తిప్పే ట్విస్ట్ వస్తుంది. సెల్మా అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బిల్ ఒక పోలీస్ ఆఫీసర్. అతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, సెల్మా దాచుకున్న డబ్బును దొంగిలిస్తాడు. తన కొడుకు ఆపరేషన్ కోసం దాచిన ఆ డబ్బును తిరిగి ఇవ్వమని సెల్మా బతిమాలినా అతను వినడు. ఆ గొడవలో అనుకోకుండా బిల్ చనిపోతాడు. సెల్మా ఆ డబ్బును తన కొడుకు ఆపరేషన్ కోసం ఆసుపత్రికి పంపేస్తుంది. కానీ బిల్ హత్య కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేస్తారు.

Advertisement

కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి సెల్మా దగ్గర ఏ ఆధారాలు ఉండవు. తన కొడుకు ఆపరేషన్ గురించి చెబితే, ఆ డబ్బును కోర్టు లాక్కుంటుందేమోనని భయపడి ఆమె నిజం చెప్పదు. ఫలితంగా ఆమెకు ఉరిశిక్ష పడుతుంది. చివరి నిమిషంలో కూడా తన కొడుకుకు చూపు వస్తుందనే ఆశతో, కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్‌తో ఆమె మరణశిక్షను అనుభవిస్తుంది. ఇది నిజంగా మనసును పిండేసే ఒక విషాద గాథ.

Read Also : పుట్టినరోజునే చావు కేకలు… ప్రతిరోజు చచ్చి బతికే అమ్మాయి… బుర్ర హీటెక్కించే టైమ్ లూప్ కాన్సెప్ట్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×