E-Paper
Advertisement

దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… సీను సీనుకీ సీటీ కొట్టాల్సిందే

దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… సీను సీనుకీ సీటీ కొట్టాల్సిందే
Advertisement

Action Movies on OTT: యాక్షన్ సినిమాలంటే కేవలం ఫైట్లు, గన్లు మాత్రమే కాదు.. అవి ఒక ఎమోషన్. ఈ ఐదు సినిమాలను గనుక చూస్తే అవుననే అంటారు. ఇవి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపడమే కాదు, సినిమాటిక్ హిస్టరీలోనే మాస్టర్ పీస్‌లుగా నిలిచిపోయాయి. ప్రతి సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపించే ఈ సినిమాలను చూస్తే సీన్ సీన్ కి ఈల కొట్టాల్సిందే. ఈ యాక్షన్ సినిమాలను థియేటర్లో చూసినా, ఓటీటీలో చూసినా కిక్కు ఏమాత్రం తగ్గదు.

1. Crouching Tiger, Hidden Dragon (2000)

చైనీస్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రపంచానికి ఒక కళలా పరిచయం చేసిన సినిమా ఇది. గాలిలో తేలుతూ చేసే ఫైట్లు, వెదురు చెట్లపై చేసే పోరాటాలు అప్పట్లో ఒక సంచలనం. యాక్షన్ అంటే రక్తం చిందించేలా కాకుండా, వాటిలో కూడా ఒక అందం ఉంటుందని దర్శకుడు ఆంగ్ లీ ఈ సినిమాలో నిరూపించారు. ఇది ప్రస్తుతం Amazon Prime Video, Apple TV లో రెంటల్ కి అందుబాటులో ఉంది.

2. Mad Max: Fury Road (2015)

Advertisement

ఈ సినిమా ఒక విజువల్ వండర్. సినిమా మొదలైనప్పటి నుండి ఎండింగ్ వరకు ఒకటే చేజింగ్. ఎడారిలో భారీ వెహికల్స్ తో చేసే విన్యాసాలు చూస్తుంటే సీటు అంచున కూర్చోవాల్సిందే. సిజిఐ కంటే ఎక్కువగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఇందులో టామ్ హార్డీ, షార్లీజ్ థెరాన్ ల పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఇది Jio Cinema, Netflix లో స్ట్రీమ్ అవుతోంది.

3. Raiders of the Lost Ark (1981)

ఇది ఇండియానా జోన్స్ సిరీస్ లో మొదటిది. స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ చేసిన సాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ భారీ రాయి వెంటపడే సీన్ కానీ, పాములతో నిండిన గుహ సీన్ కానీ ఇప్పటికీ ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తాయి. యాక్షన్ కి అడ్వెంచర్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. Jio Hotstar లో ఈ సినిమాని చూడొచ్చు.

4. The Matrix (1999)

Advertisement

యాక్షన్ సినిమాల్లో టెక్నాలజీని, ఫిలాసఫీని మిక్స్ చేసి తీసిన గొప్ప ప్రయోగం ‘ది మాట్రిక్స్’. కియాను రీవ్స్ బుల్లెట్స్ నుంచి తప్పించుకునే స్లో మోషన్ సీన్ సినిమా చరిత్రలోనే అత్యంత అద్భుతమైన సీన్ గా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ సినిమా తర్వాతే చాలా సినిమాల్లో బుల్లెట్ కి టైమ్ ఎఫెక్ట్ వాడటం మొదలుపెట్టారు. ఇది Amazon Prime Video, Netflix లో అందుబాటులో ఉంది.

5. The Dark Knight (2008)

సూపర్ హీరో సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్. క్రిస్టోఫర్ నోలన్ మేకింగ్, హీత్ లెడ్జర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం ఫైట్లు మాత్రమే కాదు, హీరోకి విలన్ ఇచ్చే సైకలాజికల్ వార్ ఊపిరి బిగబట్టేలా చేస్తుంది. Netflix, Amazon Prime Video లో ఈ సినిమాను చూడవచ్చు. ఈ ఐదు సినిమాలు కేవలం టైమ్ పాస్ కోసం చూసేవి కావు. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, కొరియోగ్రఫీలో ఇవి మాస్టర్ పీస్ లు. యాక్షన్ ప్రేమికులైతే వీటిని కచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో ఉంచుకోవాలి.

Read Also : నమ్మినోల్లే నట్టేట ముంచే ఘోరమైన మోసం… మత్తులో ఉన్న అమ్మాయితో… చిన్న పిల్లలు చూడకూడని సినిమా

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×