E-Paper
Advertisement

Lock Down Movie OTT : అనుపమ పరమేశ్వరన్ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి… తెలుగులోనూ చూడచ్చు

Lock Down Movie OTT : అనుపమ పరమేశ్వరన్ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి… తెలుగులోనూ చూడచ్చు
Advertisement

Lock Down Movie OTT : అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన తమిళ సర్వైవల్ థ్రిల్లర్ ‘లాక్ డౌన్’ సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఇది ఓటీటీలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటంతో మంచి రెస్పాన్స్ పొందే అవకాశం ఉందని మేకర్స్ ఆశతో ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో రూపొందిన ఈ కథ, ప్రెగ్నెంట్ అయిన ఒక పెళ్ళికాని అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆ రోజుల్లోని సమస్యలను కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఎ.ఆర్.జీవా దర్శకత్వంలో వచ్చిన ‘లాక్ డౌన్’ (Lock Down)ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది మార్చి 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Pime video)లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 2026 జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ఒక హై టెన్షన్ సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనిత (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. దేశంలో అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అనిత ఒంటరిగా చిక్కుకుపోతుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆ సమయంలో అనిత ప్రెగ్నెంట్ అయినట్లు తెలుసుకుంటుంది. ఒక పార్టీలో అనుకోకుండా జరిగిన తప్పు వల్ల ఈ పరిస్థితి వస్తుంది ఆమెకు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని, వెంటనే అబార్షన్ చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆ సమయంలో హాస్పిటల్స్ అన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతాయి. దీంతో ఆమె అటు అబార్షన్ చేసుకోలేక, దీని నుంచి బయటపడలేక నరకయాతన పడుతుంది. చివరికి ఆమె దీని నుంచి బయట పడుతుందా ? ప్రెగ్నెంట్ కి కారణం ఎవరు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Read Also : సెబాస్టియన్ స్టాన్, ఆడమ్ పియర్సన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×