E-Paper
Advertisement

Malayalam Movie OTT : మలయాళం సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… కడుపుబ్బా నవ్వించే డాల్మేషియన్ కుక్క

Malayalam Movie OTT : మలయాళం సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… కడుపుబ్బా నవ్వించే డాల్మేషియన్ కుక్క
Advertisement

Malayalam Movie OTT : ఓటీటీలో మలయాళ సినిమాలకు ఆదరణ ఇప్పుడు ఎక్కువగా ఉంది. అక్కడ సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు మేకర్స్. రియలిస్టిక్ గా ఉండే ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు కూడా తెగ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఇక ఈ మధ్య వస్తున్న సినిమాలు దాదాపు హిట్ టాక్ సొంతం చేసుకుని వచ్చినవే. ఈ నేపథ్యంలో మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీని, మరికొన్ని గంటల్లో ఎంచక్కా చూసేయచ్చు.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

రాజేష్ మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ డ్రామా పేరు ‘పెన్నుమ్ పోరాట్టమ్’ (Pennum Porattum). ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 13న విడుదలై విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. IMDbలో 8.2 రేటింగ్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇది 2026 మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో రైనా రాధాకృష్ణన్, దినేష్ కీలక పాత్రల్లో నటించగా, రాజేష్ మాధవన్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఇక రాజేష్ మాధవన్ దర్శకుడిగా, తన మొదటి సినిమాతోనే ఇంత పెద్ద హిట్ కొట్టడం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సుట్టు అనే డాల్మేషియన్ కుక్కకు మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ వాయిస్ ఓవర్ చెప్పడం. ఈ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా, యూనిక్‌గా కూడా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పాలక్కాడ్‌లోని ఒక గ్రామంలో చారులత అనే అమ్మాయి, తన పెంపుడు కుక్క సుట్టుతో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటుంది. అయితే ఒకానొక చిన్న సంఘటన కారణంగా ఆమె మీద, ఆ కుక్క మీద ఊరిలో లేనిపోని పుకార్లు పుట్టుకొస్తాయి. ఆ పుకార్లు ఎంతలా ముదిరిపోతాయంటే, ఊరి జనం అంతా ఏకమై ఆమెపై పడి దాడి చేసేంత గందరగోళం మొదలవుతుంది. చారులత తనను తాను ఎలా కాపాడుకుంది ?, ఈ పిచ్చి జనం నుండి ఆమె ఎలా తప్పించుకుంది ? అసలు ఆ పుకార్లు ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే. ఇక ఆ కుక్కకు హీరో టోవినో థామస్ తన వాయిస్ ఇవ్వడం సినిమాకు పెద్ద హైలైట్. ఆ కుక్క వల్ల వచ్చే సీన్స్ మాత్రం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.

Read Also : దుర్యోధనుడి అవతారంలో సీరియల్ కిల్లర్… యుగాలు దాటే ప్రతీకారం…కసిగా ఒక్కో హత్య

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×