psychological thriller OTT : ఓటీటీలోకి ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. న్యూరోఫైబ్రోమాటోసిస్‌తో బాధపడుతున్న ఒక స్టేజ్ ఆర్టిస్ట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అంటే అతని ముఖం చాలా వికృతంగా ఉంటుంది. ఎవరూ కనీసం చూడటానికి సాహసం కూడా చెయ్యరు. అయితే ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ కి అందుబాటులో ఉండనుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ పేరు ‘ఎ డిఫరెంట్ మ్యాన్’. దీనికి ఆరోన్ షింబెర్గ్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో సెబాస్టియన్ స్టాన్, రెనేట్ రీన్స్వే, ఆడమ్ పియర్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 జనవరి 21న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఆ తరువాత ఫిబ్రవరి 16న 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇక్కడ స్టాన్ ఉత్తమ నటనకు సిల్వర్ బేర్ పురస్కారం లభించింది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో 2024సెప్టెంబర్ 20, A24 ద్వారా థియేటర్‌లలో విడుదలైంది.
ఈ చిత్రం 97వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ మేకప్, హెయిర్‌స్టైలింగ్‌కి నామినేషన్ ను సంపాదించింది. సెబాస్టియన్ స్టాన్ తన అద్భుతమైన నటనకు గాను 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. నిజ జీవితంలో కూడా న్యూరోఫైబ్రోమాటోసిస్‌తో బాధపడుతున్న ఆడమ్ పియర్సన్, తన సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇక ఈ సినిమా 2026 మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఎడ్వర్డ్ అనే యువకుడు ఒక స్టేజ్ ఆర్టిస్ట్. తన మొహంపై ఉన్న వైకల్యం వల్ల సమాజంలో తిరగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఆత్మవిశ్వాసం లేక ఒక ప్రయోగాత్మక చికిత్స ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. ఆ చికిత్స తర్వాత అతను ఎంతో అందంగా, ఒక మోడల్‌లా తయారవుతాడు. తన పాత జీవితాన్ని వదిలేసి, కొత్త పేరుతో కొత్త మనిషిగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడు.
అయితే ఇంతలో అతని పాత జీవితం ఆధారంగా, అతని పొరుగున ఉండే రచయిత్రి ఒక నాటకం రాస్తుంది. ఆ నాటకంలో హీరోగా నటించాలనుకున్న ఎడ్వర్డ్‌కి ఒస్వాల్డ్ రూపంలో ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఒస్వాల్డ్‌కి కూడా ఎడ్వర్డ్‌కు ఉన్నట్టే ముఖ వైకల్యం ఉంటుంది, కానీ అతను చాలా తెలివైనవాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. అందంగా ఉన్న ఎడ్వర్డ్ కంటే, ఆత్మవిశ్వాసంతో ఉన్న ఒస్వాల్డ్ అందరినీ ఆకట్టుకోవడం ఎడ్వర్డ్ భరించలేకపోతాడు.
ఒస్వాల్డ్‌ను చూసి అసూయ పడుతూ ఎడ్వర్డ్ తన ప్రశాంతతను కోల్పోతాడు. అందమైన మొహం ఉన్నా సంతోషంగా ఉండలేకపోవడం, తన పాత జీవితాన్ని ఒస్వాల్డ్ దక్కించుకుంటున్నాడనే భయం అతన్ని పిచ్చివాడిని చేస్తాయి. చివరకు ఎడ్వర్డ్ తనలో ఉన్న ఈ గందరగోళాన్ని అధిగమిస్తాడా ? ఒస్వాల్డ్‌ను చూసి తాను ఏం నేర్చుకుంటాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఎదుటివాడి మైండ్‌తో ఆడుకునే సైకో దెయ్యం… నవ్వుతూ చచ్చే మనుషులు… జడిపించే సీన్లు