E-Paper
Advertisement

Tapsee Pannu Films OTT: ‘పింక్’ నుండి ‘థప్పడ్’ వరకు… ‘అస్సీ’ విడుదలకు ముందు చూడాల్సిన తాప్సీ పన్ను అద్భుతమైన సినిమాలు ఇవే

Tapsee Pannu Films OTT: ‘పింక్’ నుండి ‘థప్పడ్’ వరకు… ‘అస్సీ’ విడుదలకు ముందు చూడాల్సిన తాప్సీ పన్ను అద్భుతమైన సినిమాలు ఇవే
Advertisement

Tapsee Pannu Films OTT : దాదాపు 16 సంవత్సరాల కెరీర్‌లో తాప్సీ హిందీ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కోర్టు రూమ్ డ్రామాల నుండి కామెడీ, స్పై థ్రిల్లర్లు వరకు పనిచేసింది. చాలా కాలంగా వెండి తెరకు దూరంగా ఉన్న తాప్సీ పన్ను ఇప్పుడు ఒక పవర్ఫుల్ కోర్టు రూమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తోంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన “అస్సీ” చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను చూసే ముందు తాప్సీ బెస్ట్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

“పింక్”

అనురాధ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ లీగల్ థ్రిల్లర్. తాప్సీ పన్ను ఒక కేసులో న్యాయం కోసం పోరాడే మీనల్ అరోరా పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కృతి కుల్హారి, అంగద్ బేడి కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టర్‌లో అందుబాటులో ఉంది.

“ముల్క్”

Advertisement

​ఒక ముస్లిం కుటుంబంలోని ఒకరి మీద ఉగ్రవాద ఆరోపణలు వచ్చిన తర్వాత స్టోరీ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ కోర్టు రూమ్ డ్రామాలో దివంగత రిషి కపూర్‌తో పాటు తాప్సీ పన్ను కూడా నటించింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ZEE5, ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

“బేబీ”

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో తాప్సీ పన్ను షబానా ఖాన్ అనే అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ కూడా నటించారు. ఈ సినిమా ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

“థప్పడ్”

Advertisement

ఈ సినిమా తాప్సీ పన్ను కెరీర్‌లో అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటి. అందులో ఆమె పెళ్లిలో చెంపదెబ్బ కొట్టబడిన తర్వాత తన ఆత్మగౌరవం కోసం నిలబడే గృహిణిగా నటించింది.  బెనారస్ మీడియా వర్క్స్, టీ – సిరీస్ బ్యానర్‌లపై భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ సినిమాకి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, దియా మీర్జా, కముద్‌ మిశ్రా, రత్నా పాఠక్‌ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021లో ఏడు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

‘బద్లా’

సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘బద్లా’ చిత్రంలో తాప్సీ పన్ను, అమితాబ్ బచ్చన్ జంట మరోసారి కలిసి కనిపించారు. దీనికి ముందు, ఇద్దరూ పింక్ చిత్రంలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

‘హసీన్ దిల్‌రుబా’

తన భర్త రిషు (విక్రాంత్ మాస్సే) హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రాణి (తాప్సీ), పోలీసు విచారణలో తన వివాహ జీవితం గురించి చెప్పే కథే ఈ సినిమా. ప్రేమ, పగ, వివాహేతర సంబంధంతో సాగే ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ netflixలో అందుబాటులో ఉంది.

Read Also :  వాలెంటైన్స్ డే స్పెషల్… గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ తెలుగు రొమాంటిక్ సిరీసులు

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×