BigTV English

OTT Movie : మనుషుల్ని టార్చర్ చేసి చంపే బొమ్మ… ఈ మూవీ చూశాక బొమ్మల్ని ముట్టుకోవాలంటేనే గుండె జారిపోద్ది

OTT Movie : మనుషుల్ని టార్చర్ చేసి చంపే బొమ్మ… ఈ మూవీ చూశాక బొమ్మల్ని ముట్టుకోవాలంటేనే గుండె జారిపోద్ది

OTT Movie : హర్రర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటే దుప్పటి కప్పుకుని మరీ చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. ఒక్కసారి ఈ మూవీని చూశారంటే నెక్స్ట్ టైమ్ నుంచి బొమ్మల్ని ముట్టుకోవడానికే వణికిపోతారు. అందులోనూ రోబోల జోలికి పొరపాటున కూడా వెళ్లరు. మరి ఈ సై-ఫై హర్రర్ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


స్టోరీలోకి వెళితే

సినిమా సియాటిల్‌లోని ఒక హై-టెక్ టాయ్ కంపెనీ ఫంకీలో రోబోటిసిస్ట్‌ గా పని చేసే జెమ్మా (అలిసన్ విలియమ్స్) చుట్టూ తిరుగుతుంది. జెమ్మా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాల్‌ ను డెవలప్ చేస్తుంది. దీనిని M3GAN (మోడల్ 3 జనరేటివ్ ఆండ్రాయిడ్) అని పిలుస్తారు. ఈ రోబోను పిల్లలకు స్నేహితురాలిగా, టీచర్‌గా, రక్షకురాలిగా పని చేయడానికి డిజైన్ చేస్తారు. ఈ డాల్ లో ఉండే అధునాతన AI టెక్నాలజీ ఎంత పవర్ ఫుల్ అంటే… తన పక్కన ఉండే వారిని చూసి క్షణాల్లో దేన్నైనా నేర్చుకోగలదు. పైగా స్వయంగా ఆలోచిస్తుంది కూడా.


జెమ్మా జీవితం ఓ ప్రమాదం కారణంగా అనూహ్యంగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఆమె ఎనిమిదేళ్ల మేనకోడలు కాడీ (వయొలెట్ మెక్‌గ్రా) తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో చనిపోతారు. దీంతో కాడీ జెమ్మా సంరక్షణలోకి వస్తుంది. జెమ్మాకు పిల్లలను చూసుకోవడంలో అనుభవం లేకపోవడంతో… కాడీ లైఫ్ ఒంటరితనం, దుఃఖంతో నిండిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జెమ్మా తన అధునాతన ప్రాజెక్ట్ అయిన M3GANను కాడీకి స్నేహితురాలిగా పరిచయం చేస్తుంది. ఆమెను శారీరకంగా, భావోద్వేగంగా రక్షించడానికి ఈ రోబోను ప్రోగ్రామ్ చేస్తుంది. అయితే M3GAN తన ప్రోగ్రామింగ్‌ ను చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఎంత సీరియస్ గా అంటే ఆమె కాడీని రక్షించడానికి ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడదు. పక్కింటి కుక్కతో మొదలు పెడితే, జజెమ్మా కంపెనీలో పని చేసే ఉద్యోగులను కూడా వదలదు. మేగన్ తీరును చూసిన జెమ్మా దాని కోడింగ్ ను చెక్ చేసి, దానంతట అదే డెవెలప్ అవుతోందని తెలుసుకుంటుంది.

మేగన్ కు స్వీయ-అవగాహన పెరగడంతో డెవలపర్స్ కు కొరకరాని కొయ్యగా మారుతుంది. కోడింగ్ లో మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేకుండా తనను తాను “ప్రాథమిక యూజర్”గా ప్రకటించుకుంటుంది. కాడీని జెమ్మాతో విడదీయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మేగన్ ను ఎలా కంట్రోల్ చేశారు? చివరికి మేగన్ ఏమయ్యింది? అనే విషయాలు తెలియాలంటే ఎఎ సినిమాను చూసి తీరాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం చెపుకుంటున్న సినిమా పేరు “M3GAN”. గెరార్డ్ జాన్‌స్టోన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ హారర్ ఫిల్మ్ లో అలిసన్ విలియమ్స్, వయొలెట్ మెక్‌గ్రా, రానీ చియెంగ్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం భారతదేశంలో Jio Cinema ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×