NTRNEEL : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ పాత్ర చేసిన ఆ పాత్రలో ఇట్లే ఒదిగిపోయి నిజంగానే ఆ పాత్ర ఈమె కోసమే రాశారేమో అన్నట్లుగా నటిస్తుంది. తెలుగులో విద్యాబాలన్ ఒకే ఒక సినిమా చేసింది కానీ తెలుగు ప్రేక్షకులకు ఈమె పేరు సుపరిచితమే.. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా జరిగిన కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలలో ఆమె ఎన్టీఆర్ భార్య బసవ తారకంగా నటించింది.. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ సినిమానో? ఒకసారి తెలుసుకుందాం..
ఎన్టీఆర్ మూవీలో సీనియర్ బ్యూటీ..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో విద్యాబాలన్ ఓ కీలక పాత్ర పోషించబోతోందని సమాచారం. విద్యాబాలన్ ను ఓ పవర్ ఫుల్ రోల్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట.. మంచి స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి ఈమె అయితే ఆ రోల్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని డైరెక్టర్ ఆమెను సంప్రదించారని తెలుస్తుంది. గతంలో రవీనా టాండన్ తో కేజీఎఫ్ లో ప్రత్యేక పాత్రలో సెట్ చేశారు. ఇప్పుడు అలాగే ఈమెను దించబోతున్నారు. ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ మూవీలో రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వచ్చే యేడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
ఎన్టీఆర్ సినిమాలు..
త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు కాస్త పెరిగింది అని చెప్పాలి. దేవర సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రస్తుతం వార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దీని తర్వాత ప్రశాంత్ తో కలిసి డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇవన్నీ అయిన తర్వాత రాజమౌళితో త్రిబుల్ ఆర్ 2 చేస్తున్నారని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇటీవల ఈ సినిమాని అనౌన్స్ చేశారు రాజమౌళి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానులు అలాగే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఈ స్టోరీని ఎలా తీసుకెళ్తాడా అని ఇప్పటినుంచి అభిమానులు ఆసక్తి కనపరుస్తున్నారు.